ETV Bharat / sports

'డెత్​ ఓవర్లలో బ్యాటింగ్​ అదరగొట్టాలని ఉంది'

author img

By

Published : Sep 21, 2020, 6:39 AM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

ఐపీఎల్​ డెత్​ ఓవర్లలో బ్యాటింగ్​లో రాణించాలని భావిస్తున్నట్లు సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఆల్​రౌండర్​ రషీద్​ ఖాన్ తెలిపాడు. నేడు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో తన తొలి మ్యాచ్​లో తలపడనుంది సన్​రైజర్స్.

IPL 2020
రషీద్​ ఖాన్​

ఈ ఏడాది ఐపీఎల్​లో డెత్​ ఓవర్ల సమయంలో బ్యాటింగ్​ పరంగా మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నట్లు సన్​రైజర్స్ హైదరాబాద్​ ఆల్​రౌండర్ రషీద్​ ఖాన్​ తెలిపాడు. సెప్టెంబరు 19న ముంబయి, చెన్నై జట్ల మధ్య పోరుతో లీగ్​ ప్రారంభమైంది. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో దుబాయ్​ అంతర్జాతీయ స్టేడియంలో సన్​రైజర్స్ తలపడనుంది. ఈ సందర్భంగా ఆదివారం వర్చువల్​ మీడియా సమావేశంలో మాట్లాడిన రషీద్​ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

IPL 2020
ఐపీఎల్​లో రషీద్​ ఖాన్​ ఘనతలు

"ఇన్నింగ్స్​లో మూడు, నాలుగు ఓవర్లు మిగిలి ఉన్నప్పుడు.. బ్యాటింగ్​ పరంగా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలనని నేను అనుకుంటున్నా. నేను బిగ్​బాష్​ లీగ్ ఆడుతున్న సమయంలో నా కోచ్​ సిబ్బంది 15 ఓవర్ల తర్వాత ఎలా బ్యాటింగ్​ చేయాలో సూచించారు. ఆ విధంగా కోచ్​, కెప్టెన్​ నుంచి మంచి స్పందన లభిస్తే.. అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది. కేవలం బ్యాటింగ్​లోనే రాణించాలని నేను అనుకోవడం లేదు. మ్యాచ్​ మొత్తంగా ఏ విధంగా నేను సాయపడగలనో ఆలోచిస్తుంటా. జట్టును విజయం వైపు నడిపించేందుకు నా వంతు కృషి చేస్తా."

-రషీద్​ ఖాన్​, సన్​రైజర్స్ హైదరాబాద్​ క్రికెటర్​

ప్రత్యర్థి జట్టు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ గురించి స్పందిస్తూ.."ఎవరైనా బౌలింగ్ చేస్తున్నప్పుడు కాస్త ఒత్తిడికి లోనవుతారు. విరాట్ అన్ని ఫార్మాట్లలో​ ప్రపంచ స్థాయి ఆటగాడు. అతనికి బౌలింగ్​ చేయడాన్ని ఆస్వాదిస్తా. ఒక బౌలర్​గా నేను ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా" అని రషీద్ పేర్కొన్నాడు.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.