ETV Bharat / sports

'స్టోక్స్​, శాంసన్ ఇన్నింగ్స్ అద్భుతం'

author img

By

Published : Oct 26, 2020, 2:27 PM IST

అబుదాబి వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ను చిత్తు చేసి భారీ లక్ష్యాన్ని ఛేదించింది రాజస్థాన్​ రాయల్స్ జట్టు. ఈ మ్యాచ్​లో మెరుపు ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్న బెన్​ స్టోక్స్, సంజూ శాంసన్​​ను కొనియాడాడు ముంబయి ఆల్​రౌండర్​ హార్ధిక్.

Hardik Pandya_MI
బట్లర్​ మెరుపు ఇన్నింగ్స్​ను కొనియాడిన హార్ధిక్​ పాండ్య

భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించి రాజస్థాన్ రాయల్స్​ విజయానికి బాట వేసిన బెన్​ స్టోక్స్​, సంజూ శాంసన్​ను కొనియాడాడు ముంబయి ఆల్​రౌండర్ హార్ధిక్ పాండ్యా. ఈ మ్యాచ్​లో ముంబయి జట్టుకు 60 పరుగులు జోడించిన హార్ధిక్.. సిక్సర్​​లు బాదడం అంటే తనకు ఇష్టమని పేర్కొన్నాడు.

"సిక్సర్​లు కొట్టడం బాగా ఆనందాన్నిస్తుంది. రెండో సారి టైం ఔట్​ విరామం వచ్చినప్పుడు ఉన్న మా జట్టు స్కోర్​ను బట్టి అంతిమంగా 160-170 పరుగులు లక్ష్యంగా ఉంచాలని భావించాం. కానీ, అనుకున్న లక్ష్యానికి 25 పరుగులు ఎక్కువగానే చేశాం. బెన్ ​స్టోక్స్, సంజూ ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు. రాజస్థాన్​ విజయంలో వారి పాత్ర కీలకం."

- హార్ధిక్​ పాండ్యా, ముంబయి జట్టు ఆల్​ రౌండర్.

కొన్నిసార్లు మనం ప్రత్యర్థి జట్టు ఆటను కూడా ప్రశంసించాలి అని హార్ధిక్​ అన్నాడు. స్టోక్స్, శాంసన్​ బ్యాటింగ్​ చేసిన తీరు తనకు అద్భుతంగా అనిపించిందని పేర్కొన్నాడు. ముంబయి బౌలర్లకు మరో అవకాశమే లేకుండా లక్ష్యాన్ని ఛేదించారని కొనియాడాడు.

అబుదాబి వేదికగా ముంబయితో తలపడ్డ రాజస్థాన్​ 8 వికెట్ల తేడాతో భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబయి 195 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్​ ముందుంచింది. హార్ధిక్​ 21 బంతుల్లో 60 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ప్రత్యర్థి జట్టు ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.

ఇదీ చదవండి:ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.