ETV Bharat / sports

ప్రాక్టీసులో రుతురాజ్.. రాజస్థాన్​తో మ్యాచ్​కు?

author img

By

Published : Sep 21, 2020, 4:50 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

CSK batsman Ruturaj Gaikwad back in training after clearing two COVID-19 tests
CSK batsman Ruturaj Gaikwad

సీఎస్కే ఆటగాడు రుతురాజ్​.. ఎట్టకేలకు మైదానంలో అడుగుపెట్టి ప్రాక్టీసులో పాల్గొన్నాడు. అంతకుముందు కరోనా పాజిటివ్ రావడం, రెండు వారాల ఐసోలేషన్​ ఉండటం వల్ల ముంబయితో జరిగిన తొలి మ్యాచ్​కు దూరమయ్యాడు.

చెన్నై సూపర్​కింగ్స్ యువ బ్యాట్స్​మన్ రుతురాజ్​ గైక్వాడ్​.. ఇటీవల చేసిన రెండు వైద్య పరీక్షల్లో కరోనా నెగిటివ్​గా తేలింది. దీంతో ప్రాక్టీసులో పాల్గొన్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే ట్వీట్ చేసింది. క్వారంటైన్​లో ఉండటం వల్ల తొలి మ్యాచ్​లో ఆడలేకపోయిన ఇతడు.. రాజస్థాన్​తో మంగళవారం జరిగే పోరులో బరిలో దిగే అవకాశముంది.

ప్రస్తుత సీజన్ నుంచి సురేశ్ రైనా పూర్తిగా తప్పుకోవడం వల్ల అతడి స్థానంలో రుతురాజ్​ ఆడతాడని భావిస్తున్నారు. కానీ తొలి మ్యాచ్​లో మూడో స్థానంలో వచ్చిన డుప్లెసిస్ అద్భుతంగా ఆడి, 58 పరుగులు చేశాడు. రాయుడు(71)తో పాటు విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో రుతురాజ్​కు ఛాన్స్ ఇస్తారా? బెంచ్​కే పరిమితం చేస్తారా? అనేది చూడాలి.

Last Updated :Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.