ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ టీమ్​లో మార్పులు చేసిన పాకిస్థాన్​

author img

By

Published : Oct 8, 2021, 8:20 PM IST

టీ20 ప్రపంచకప్ కోసం మరోసారి తమ జట్టును ప్రకటించింది పాకిస్థాన్ క్రికెట్​ బోర్డు. జట్టులోని ముగ్గురు ఆటగాళ్లను మార్పులు చేస్తున్నట్లు పీసీబీ శుక్రవారం ప్రకటించింది.

Pakistan make three changes to their 15-member T20 World Cup squad
టీ20 ప్రపంచకప్​ టీమ్​లో మార్పులు చేసిన పాకిస్థాన్​

టీ20 ప్రపంచకప్​లో పాల్గొనే పాకిస్థాన్​ జట్టును కొన్ని మార్పులతో మరోసారి ప్రకటించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. ఈ మెగాటోర్నీ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 10 వరకు జట్లలో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. దీంతో తమ జట్టులో పీసీబీ మూడు మార్పులను చేసింది. గతంలో ప్రకటించిన మహ్మద్​ హస్నేన్​, అజమ్​ ఖాన్​ స్థానాల్లో సర్ఫరాజ్​ అహ్మద్​, హైదర్​ అలీలను ఎంచుకోగా.. రిజర్వ్​ ఆటగాళ్లలో ఫఖర్​ జమాన్​ బదులుగా ఖుష్​దిల్​ షాను రీప్లేస్​ చేసినట్లు పాక్​ క్రికెట్​ బోర్డు తెలిపింది. సక్లెయిన్​ ముస్తాక్​ను తాత్కాలిక కోచ్​గా నియమిస్తున్నట్లు పేర్కొంది.

పాకిస్థాన్​ స్క్వాడ్​: బాబర్​ అజామ్​(కెప్టెన్​), షాదాబ్​ ఖాన్​(వైస్​ కెప్టెన్​), ఆసిఫ్​ అలీ, ఫఖర్​ జమాన్​, హైదర్​ అలీ, హరిస్​ రఫ్​, హసన్​ అలీ, ఇమాద్​ వసీమ్, మహ్మద్​ హఫీజ్​, మహ్మద్​ నవాజ్​, మహ్మద్ రిజ్వాన్​(వికెట్ కీపర్​), మహ్మద్​ వసీమ్​ జూ., సర్ఫరాజ్​ అహ్మద్​, షహీన్​ షా అఫ్రిది, సోహైబ్​ మక్​సూద్​.

రిజర్వ్ ఆటగాళ్లు: ఖుష్​దిల్​ షా, షహ్నవాజ్​ దహాని, ఉస్మాన్​ ఖాదిర్​.

ఇదీ చూడండి.. T20 worldcup: మెగాటోర్నీ కోసం జట్టును ప్రకటించిన పాకిస్థాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.