ETV Bharat / sports

పెళ్లి తర్వాత రోహిత్​లో ఇంత మార్పా?

author img

By

Published : Aug 12, 2021, 11:53 AM IST

పెళ్లి తర్వాత రోహిత్​ శర్మ చాలా మారిపోయాడని అంటున్నాడు దినేశ్​ కార్తిక్(Dinesh Karthik commentary)​​. 'సూర్యవంశం' సినిమా చూసి ఏడ్చేసే అంత సున్నిత స్వభావం ఉన్న రోహిత్​(Rohit Sharma news).. ఇప్పుడు గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​ వంటి సిరీస్​లు చూసేస్తున్నాడని చెబుతున్నాడు.

rohit sharma
రోహిత్​ శర్మ

కామెంటేటర్​ అవతారం ఎత్తిన తర్వాత క్రికెటర్​ దినేశ్​ కార్తిక్(Dinesh Karthik commentary)​ రెట్టింపు ఉత్సాహంతో కనపడుతున్నాడు. ఇంగ్లాండ్​ పర్యటనలో ఉన్న టీమ్​ఇండియా ఆటగాళ్లను ఒక్కొక్కొరిగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు​. తొలి టెస్టు సందర్భంగా విరాట్​ కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన డీకే.. అతడి జీవితంలోని అనేక ఆసక్తికర విషయాలను అభిమానులకు అందించాడు. ఇక ఇప్పుడు భారత డాషింగ్​ ఓపెనర్​ రోహిత్​ శర్మతో సంభాషించాడు.

లార్డ్స్​ వేదికగా రెండో టెస్టు గురువారం ప్రారంభంకానుంది. దీనికి ముందు.. రోహిత్​ను ఇంటర్వ్యూ(Rohit Sharma news) చేశాడు డీకే. ఇందుకు సంబంధించిన స్నీక్​ పీక్​ ఒకటి.. తన ట్విట్టర్​ ఖాతాలో పంచుకున్నాడు. అందులో.. రోహిత్​ పెళ్లి తర్వాత మారిపోయాడన్నాడు కార్తిక్​.

"రితిక(Rohit Sharma wife)తో వివాహానికి ముందు రోహిత్​ శర్మ 'సూర్యవంశం' సినిమా చూసిన ఏడ్చేసేవాడు. కానీ పెళ్లి తర్వాత.. రోహిత్​ మారిపోయాడు. గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​, బ్రేకింగ్​ బ్యాడ్​ వంటి ఇంగ్లీష్​ వెబ్​ సిరీస్​లు చూసేస్తున్నాడు" అని డీకే చెప్పగా.. రోహిత్​ శర్మ నవ్వుతూ సమాధానమిచ్చాడు. "ఎవరు చెప్పారు నీకు ఇది? నిజమే.. చాలా మారింది" అంటూ సిగ్గుపడ్డాడు రోహిత్​.

ఇదీ చూడండి:- కోహ్లీకి ట్రోల్స్ బెడద.. ఇంగ్లాండ్​ ప్రేక్షకుల అత్యుత్సాహం​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.