ETV Bharat / sports

Ind vs Eng: ఆటగాళ్లను వేధిస్తున్న గాయాలు- ఎవరిది పైచేయి?

author img

By

Published : Aug 12, 2021, 5:30 AM IST

ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో ఆధిక్యమే లక్ష్యంగా భారత్, ఇంగ్లాండ్​ జట్ల మధ్య రెండో టెస్టు ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానం వేదికగా.. నేటి నుంచి జరగనుంది. తొలిటెస్టులో వరుణుడి కారణంగా విజయానికి దూరమైన టీమ్​ ఇండియా రెండో టెస్ట్‌లోనైనా జయభేరి మోగించాలని ఊవ్విళ్లూరుతోంది. కొందరు ఆటగాళ్లు గాయాల బారినపడటం ఇరు జట్లను కలవరపరుస్తోంది.

Shardul injury may bring Ashwin
ఆటగాళ్లను వేధిస్తున్న గాయాలు

భారత్​- ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​లో రెండో మ్యాచ్ లార్డ్స్​లో​ గురువారం(ఆగస్టు 12) నుంచి జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు టెస్టు ప్రారంభం కానుంది.

ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో వరుణుడి కారణంగా విజయానికి దూరమైన టీమ్ ఇండియా.. రెండో మ్యాచ్​లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని భావిస్తోంది. తొలి టెస్టులో విఫలమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానె, నయావాల్ ఛెతేశ్వర్ పుజారా గాడిలో పడాలని.. జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. తొలి టెస్టులో ఈ ముగ్గురూ కలిసి చేసింది 9 పరుగులే. అందులో కోహ్లీ డకౌట్​ కావడం గమనార్హం.

IND VS ENG 2nd Test
కోహ్లీ సేన

మయాంక్​ వస్తాడా?

గాయంతో తొలిటెస్టుకు దూరమైన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నెట్స్‌లో సాధన చేస్తుండటం టీమ్​ఇండియాకు సానుకూలాంశం. అయితే.. రాహుల్​ తొలి టెస్టులో రాణించిన నేపథ్యంలో మయాంక్​ స్థానం ప్రశ్నార్థకంగా మారింది.

పేసర్ శార్దూల్‌ ఠాకుర్‌కు ప్రాక్టీస్ సమయంలో పిక్క కండరాలు పట్టేయడం వల్ల.. అతడి స్థానంలో అశ్విన్‌, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్‌లలో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

IND VS ENG 2nd Test
గాయంతో శార్దూల్​ ఠాకుర్​ దూరం

బౌలింగ్​ ఓకే.. మరి బ్యాటింగ్​..

తొలి టెస్టులో ఓపెనర్ కేఎల్​ రాహుల్ రాణించగా.. రోహిత్ ఫర్వాలేదనిపించాడు. అయితే పుజారా, కోహ్లీ, రహానె వైఫల్యంతో భారత ఇన్నింగ్స్‌ ఇబ్బందుల్లో పడగా.. ఆల్‌రౌండర్​ రవీంద్ర జడేజాకు తోడు ఆఖర్లో​ బుమ్రా మెరుపులు మెరిపించడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఈ నేపథ్యంలో.. గతకొంతకాలంగా పరుగుల వేటలో విఫలమవుతున్న కోహ్లీ, పుజారా, రహానె లార్డ్స్‌ టెస్టులోనైనా.. ఆశించిన స్థాయిలో ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు.

IND VS ENG 2nd Test
సాధన చేస్తున్న రోహిత్​ శర్మ
IND VS ENG 2nd Test
భారత ఓపెనర్​ రోహిత్​ శర్మ

గాయంతో శార్దూల్ ఠాకుర్​ ఆడలేని పరిస్థితుల్లో సీనియర్ పేసర్‌ ఇషాంత్ శర్మను తీసుకుంటారా లేదా మరో స్పిన్నర్ అశ్విన్​తో వెళ్తారా అనే విషయం.. ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్‌లో నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్‌ కూర్పుతో ఆడతామని కోహ్లీ ఇంతకు ముందే ప్రకటించిన నేపథ్యంలో అశ్విన్‌కు చోటు దక్కడం కష్టమేనని అనిపిస్తోంది. అయితే ఇషాంత్, ఉమేష్ యాదవ్‌లతో పోలిస్తే అశ్విన్‌కు బ్యాటింగ్‌ సామర్థ్యం కలిసివచ్చే అవకాశముంది.

IND VS ENG 2nd Test
తొలి టెస్టులో రాణించిన ఇండియా బౌలర్లు

ఇంగ్లాండ్​ పుంజుకుంటుందా?

తొలి టెస్టులో ఓటమి వైపుగా పయనించి వరుణుడి దెబ్బతో డ్రా చేసుకున్న ఇంగ్లండ్ రెండో మ్యాచ్​లో సత్తాచాటాలని భావిస్తోంది. అయితే కెప్టెన్ జో రూట్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడం.. ఆతిథ్య జట్టును కలవరపరుస్తోంది. తొలిటెస్టులో విఫలమైన ఓపెనర్ రోరీ బర్న్స్‌ స్థానంలో హసీబ్‌ హమీద్‌కు జట్టులో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ జట్టు ప్రధాన బౌలర్​ స్టువర్ట్​ బ్రాడ్​ గాయం కారణంగా సిరీస్​ మొత్తానికి దూరమయ్యాడు. ఇతడి స్థానంలో సాకిబ్​ మహ్మూద్​ను తీసుకునే అవకాశాలున్నాయి.

IND VS ENG 2nd Test
ఇంగ్లాండ్​ జట్టులో బ్రాడ్​కు గాయం.. సిరీస్​కు దూరం
IND VS ENG 2nd Test
ఇంగ్లాండ్​ సారథి జో రూట్​

పిచ్‌ నుంచి స్పిన్నర్లకు సహకారం ఉంటుందని భావిస్తే.. ఆల్‌రౌండర్ మొయిన్‌ అలీని పరిగణనలోకి తీసుకునే అవకాశముంది.

ఇదీ చూడండి: Ind vs Eng: ఇచ్చిందే 4 పాయింట్లు.. అందులో 2 కోత!

జట్లు:

భారత్​: విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), రోహిత్​ శర్మ, ఛెతేశ్వర్​ పుజారా, మయాంక్​ అగర్వాల్​, అజింక్యా రహానె(వైస్​-కెప్టెన్​), హనుమ విహారి, రిషభ్​ పంత్​(వికెట్​ కీపర్​), రవిచంద్రన్​ అశ్విన్​, రవీంద్ర జడేజా, అక్షర్​ పటేల్​, జస్​ప్రీత్​ బుమ్రా, ఇషాంత్​ శర్మ, మహ్మద్​ షమీ, ఉమేశ్​ యాదవ్​, సిరాజ్​, కేఎల్​ రాహుల్​, వృద్ధిమాన్​ సాహా, అభిమన్యు ఈశ్వరన్​, పృథ్వీ షా, సూర్యకుమార్​ యాదవ్​.

ఇంగ్లాండ్​: జో రూట్​(కెప్టెన్​), జేమ్స్​ అండర్సన్​, జానీ బెయిర్​ స్టో, మొయిన్​ అలీ, రోరీ బర్న్స్​, జోస్​ బట్లర్​, జాక్​ క్రాలీ, సామ్​ కరన్​, హసీబ్​ హమీద్​, డాన్​ లారెన్స్​, జాక్​ లీచ్​, ఓలీ పోప్​, ఓలీ రాబిన్సన్​, డామ్​ సిబ్లే, మార్క్​ వుడ్​, సాకిబ్​ మహ్మూద్​.

IND VS ENG 2nd Test
ఇంగ్లాండ్​ జట్టు

ఇదీ చూడండి: భారత్​తో టెస్టు సిరీస్​.. ఇంగ్లాండ్ స్టార్ పేసర్ దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.