ETV Bharat / sports

2 రన్స్​ ఇచ్చి 5 వికెట్లు తీసిన బౌలర్​.. 34 పరుగులకే ఆలౌట్​.. టీమ్​ఇండియా సూపర్​ విక్టరీ!

author img

By

Published : Jun 13, 2023, 3:50 PM IST

Updated : Jun 13, 2023, 4:12 PM IST

Womens Emerging Aisa Cup 2023 : భారత అమ్మాయిలు అదరగొట్టారు. హాంకాంగ్​ వేదికగా జరుగుతున్న మహిళల ఎమర్జింగ్​ ఆసియా కప్ 2023 టోర్నీలో​ హాంకాంగ్​ జట్టును 34 పరుగులకే మట్టికరిపించి.. భారత-ఏ టీమ్​ ఘన విజయం సాధించింది.. దీంతో 9 వికెట్ల తేడాతో గెలచింది.

Womens Emerging Aisa Cup 2023
Womens Emerging Aisa Cup 2023

Womens Emerging Aisa Cup 2023 : టీమ్ఇండియా అమ్మాయిలు అదరగొట్టారు. మహిళల ఎమర్జింగ్​ టీమ్ ఆసియా కప్ 2023​లో అద్భుత విజయం నమోదు చేశారు. మొదటి మ్యాచ్​లోనే సత్తా చూపించి.. ప్రత్యర్థిని చిత్తు చేశారు. హాంకాంగ్​తో జరిగిన మ్యాచ్​లో చెలరేగిపోయిన భారత అమ్మాయిలు.. ఆకాశమే హద్దుగా ఆడి 34 పరుగులకే ఆ జట్టును కుప్పకూల్చారు. భారత బౌలర్ల ధాటికి హాంకాంగ్​ బ్యాటర్లలో ఒక్కరే రెండంకెల స్కోరును నమోదు చేశారు. దీంతో టీమ్ఇండియా-ఏ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

35 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. కేవలం 5.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి టార్గెట్​ను ఛేదించింది. ఓపెనర్​గా దిగిన కెప్టెన్ శ్వేతా సెహ్రావత్​ (2) పరుగులకే పెవిలియన్​ చేరగా.. ఉమా ఛెత్రి (15 బంతుల్లో 16 పరుగులు; 2x4), తెలుగు అమ్మాయి ​గొంగడి త్రిష (13 బంతుల్లో 19 పరుగులు; 2x4, 1x6) మెరుపు ఇన్నింగ్స్​ ఆడి జట్టుకు సునాయాస విజయం అందించారు.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన హాంకాంగ్​ జట్టు.. 14 ఓవర్లలో 34 పరుగులు చేసి కుప్పకూలింది. ఓపెనర్​ మరికో హిల్​ (14) తప్ప మిగతా వాళ్లందరూ సింగిల్​ డిజిట్​ స్కోరుకే పెవిలియన్ చేరారు. అందులో నలుగురు డకౌట్​ అయ్యారు. భారత బౌలర్లు హాంకాంగ్​ బ్యాటర్లపై విరుచుకు పడ్డారు. కెప్టెన్ శ్వేతా షెహ్రావత్ తమపై ఉంచిన నమ్మకాన్ని భారత బౌలర్లు నిలబెట్టుకున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే టిటాస్ సాధు (1), మన్నత్ కశ్యప్ (2) వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.

మొదట్లోనే గట్టి దెబ్బ తగిలిన హాంకాంగ్​.. ఏ దశలోనూ కోలుకునేటట్టు కనిపించలేదు. ఆ తర్వాత యంగ్​ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ చెలరేగిపోయింది. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి.. కేవలం రెండు పరుగులే ఇచ్చి.. ఏకంగా ఐదు వికెట్లు తీసుకుంది. దీంతో హాంకాగ్ జట్టు బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. శ్రేయాంక పాటిల్​తో పాటు మన్నత్ కశ్యప్ కూడా రెండు ఓవర్లలో కేవలం రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకుంది. మరో బౌలర్​ పర్​శావి చోప్రా రెండు వికెట్లు తీసింది.

ఇదే మొదటి ఎడిషన్..
Womens Emerging Asia Cup 2023 Schedule : మహిళల ఎమర్జింగ్​ ఆసియా కప్​ను ఆసియా క్రికెట్​ మండలి (ఏసీసీ) నిర్వహిస్తోంది. మహిళల క్రికెట్​కు ఆదరణ లభించాలనే ఉద్దేశంతో ఏసీసీ ఈ టీ20 టోర్నీకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జూన్​ 12 నుంచి 21 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. వీటిని గ్రూప్​-ఏ, గ్రూప్​-బీగా విభజించారు. గ్రూప్​-ఏలో.. ఇండియా, బంగ్లాదేశ్​, పాకిస్థాన్, శ్రీలంక ఉండగా.. గ్రూప్​-బీలో హాంకాంగ్​, మలేషియా, నేపాల్​, యూఏఈ ఉన్నాయి. రౌండ్​ రాబిన్​ పద్ధతిలో ప్రతి టీమ్​.. మిగతా జట్లతో ఒక మ్యాచ్​లో ఆడుతుంది. ఇలా గ్రూప్​ మ్యాచ్​లు అయిపోయేసరికి రెండు గ్రూపుల్లో టాప్​ 2 జట్లు సెమీ ఫైనల్​లో తలపడతాయి. అందులో గెలిచిన జట్లు టైటిల్​ కోసం పోరాడుతాయి.

Last Updated : Jun 13, 2023, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.