ETV Bharat / sports

'పాక్​తో మ్యాచ్.. టీమ్​ఇండియాకే సానుకూలత ఎక్కువ'

author img

By

Published : Oct 17, 2021, 7:54 AM IST

Updated : Oct 17, 2021, 11:37 AM IST

టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021)​ నేపథ్యంలో పాకిస్థాన్​ జట్టులో అద్భుతమైన మ్యాచ్ విన్నర్లు ఉన్నారని అన్నాడు ఆ జట్టు మాజీ క్రికెటర్ అజహర్ మహ్మూద్ అన్నాడు. అయితే యూఏఈలో భారత్​కే (T20 World Cup India Team) సానుకూలత ఎక్కువని చెప్పాడు.

T20 World Cup 2021
టీ20 ప్రపంచకప్

యూఏఈ వేదికగా అక్టోబర్​ 24న టీ20 ప్రపంచకప్​లో భారత్​-పాకిస్థాన్​ (India Vs Pak T20 World Cup 2021) తలపడనున్న నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ ఆల్​రౌండర్ అజహర్ మహ్మూద్ (Azhar Mahmood News). ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ (ఐపీఎల్​)​ కోసం టీమ్​ఇండియా క్రికెటర్లు యూఏఈలోనే (IPL In UAE) ఉండటం వారికి సానుకూలత చేకూర్చుతుందని అన్నాడు.

"భారత్-పాకిస్థాన్ మ్యాచ్​లు ఎప్పటికీ ప్రత్యేకమే. ఏ రోజు ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేం. అయితే టీమ్​ఇండియాకు ఒక సానుకూలత ఉంది. వారి క్రికెటర్లు టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021)​ ​ఆడబోయే యూఏఈ వేదికల్లోనే ఐపీఎల్​లో ఆడారు. పోటీతత్వ క్రికెట్ ఆడటం సహా అక్కడి పరిస్థితులపై వారికి మంచి అవగాహన ఉంటుంది."

- అజహర్ మహ్మూద్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్

ప్రపంచకప్​ చరిత్రలో (India Vs Pakistan World Cup History) పాకిస్థాన్​పై ఎప్పుడూ భారత్​దే పైచేయి. వన్డే టోర్నీలో ఏడుకు ఏడు మ్యాచ్​లు, టీ20 ఫార్మాట్​లో మొత్తం 5 మ్యాచులను టీమ్​ఇండియానే కైవసం చేసుకుంది. భారత్​-పాక్​ చివరిసారిగా 2016లో కోల్​కతాలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాయి. అందులో అన్ని విభాగాల్లో పాక్​ను చిత్తుచేసింది టీమ్​ఇండియా.

మాకు మ్యాచ్​ విన్నర్లు ఉన్నారు..

అయితే ప్రస్తుత పాకిస్థాన్​ జట్టులో (T20 World Cup 2021 Pakistan Squad) బాబర్ అజామ్, షోయమ్ మాలిక్, మహ్మద్ అహ్మద్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షహీన్ అఫ్రిదీ లాంటి మ్యాచ్​ విన్నర్లు ఉన్నారని అన్నాడు మహ్మూద్. ఈ జట్టుపై పాక్​ అభిమానులు పూర్తి నమ్మకం ఉంచవచ్చని చెప్పాడు. న్యూజిలాండ్​ పర్యటన రద్దు కారణంగా​ ఇటీవలే ఆడిన జాతీయ టీ20 కప్​తో పాక్​కు గొప్ప ప్రాక్టీస్ లభించిందని తెలిపాడు.

ఇదీ చూడండి: T20 Worldcup: 'అలా చేస్తేనే టీమ్​ఇండియా గెలుస్తుంది'

Last Updated : Oct 17, 2021, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.