ETV Bharat / sports

బడ్జెట్​ ప్రసంగం: టీమ్​ఇండియాపై ఆర్థికమంత్రి ప్రశంసలు

author img

By

Published : Feb 1, 2021, 1:00 PM IST

Updated : Feb 1, 2021, 4:53 PM IST

బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాపై టీమ్​ఇండియా చారిత్రక విజయం సాధించడం పట్ల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంట్​లో జరుగుతోన్న బడ్జెట్​ ప్రసంగంలో భారత ఆటగాళ్ల ప్రదర్శనను ఆమె కొనియాడారు.

Team India's 'spectacular success' in Aus finds mention in FM's budget speech
బడ్జెట్​ ప్రసంగం: టీమ్​ఇండియాపై ఆర్థికమంత్రి ప్రశంసలు

పార్లమెంట్​లో సోమవారం జరుగుతోన్న బడ్జెట్ 2021-22​ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. టీమ్​ఇండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్​-గావస్కర్​ టెస్టు సిరీస్​లో భారత జట్టు చారిత్రక విజయం సాధించిందని ఆమె కొనియాడారు.

"ఆస్ట్రేలియాలో టీమ్​ఇండియా చారిత్రక విజయాన్ని సాధించడం పట్ల క్రికెట్​ను ప్రేమించే దేశంగా మనమెంతో ఆనందించాం. ఆ సంతోషకర సమయాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేక పోతున్నా. యువతకు ఎలాంటి మద్దతు ఇస్తున్నామో అనేది ఈ విజయం ప్రతీక."

- నిర్మలా సీతారామన్​, ఆర్థిక మంత్రి

ఆస్ట్రేలియా కంచుకోట గబ్బా మైదానంలో చివరి టెస్టును కైవసం చేసుకుని టీమ్​ఇండియా చరిత్ర సృష్టించింది. 32ఏళ్ల తర్వాత ఆసీస్​ను ఆ మైదానంలో ఓడించి చారిత్రక విజయం నమోదు చేసింది. అడిలైడ్​లో తొలి టెస్ట్​లో ఘోరంగా ఓడినా.. అద్భుతంగా పుంజుకుని 2-1తో సిరీస్​ దక్కించుకుంది.

Team India's 'spectacular success' in Aus finds mention in FM's budget speech
బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీతో టీమ్​ఇండియా ఆటగాళ్లు

కాగా, ఆదివారం జరిగిన 'మన్​ కీ బాత్​' కార్యక్రమంలో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించిన భారత క్రికెట్​ జట్టును అభినందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జట్టు పోరాటతత్వం ఎంతో అభినందనీయమని కొనియాడారు.

"క్రికెట్​ ప్రపంచం నుంచి ఈ నెలలో శుభవార్త అందింది. ఆరంభంలో ఎదురుదెబ్బలు తిన్నా.. అద్వితీయంగా పుంజుకుని ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్​ గెలిచాం. మన జట్టు కఠోర శ్రమ, సమష్టి కృషి ఎంతో స్ఫూర్తిదాయకం."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

మోదీ ప్రశంసలకు కృతజ్ఞతలు తెలియజేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). "మీ ప్రశంసలకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు మోదీజీ," అని ట్వీట్ చేసింది.

భారత్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభంకానుంది.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​తో టెస్టుకు జట్టును ప్రకటించిన జాఫర్

Last Updated : Feb 1, 2021, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.