ETV Bharat / sports

పంత్‌పై పాంటింగ్‌ ఆగ్రహం

author img

By

Published : Jan 7, 2021, 10:33 PM IST

యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వదిలినన్ని క్యాచ్​లు మరే కీపర్‌ వదల్లేదని విమర్శలు గుప్పించాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్. పంత్​ మరింత మెరుగవ్వాలని హెచ్చరించాడు.

Ricky Ponting on Rishabh Pant
పంత్‌పై పాంటింగ్‌ ఆగ్రహం

టీమ్ఇండియా యువ వికెట్‌కీపర్‌ రిషబ్ పంత్‌ కీపింగ్‌ మరీ పేలవంగా ఉందని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. మూడో టెస్టు తొలిరోజు వికెట్ల వెనకాల అతడి ప్రదర్శన తీసికట్టుగా ఉందని విమర్శించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి మరెవ్వరూ వదలనన్ని ఎక్కువ క్యాచులు జారవిడిచాడని అన్నాడు. పరిస్థితి ఇలాగే ఉంటే కష్టమని, మరింత మెరుగ్గవాల్సిందని హెచ్చరించాడు.

తొలిరోజు ఆట ముగిశాక పాంటింగ్‌.. పంత్‌, పుకోస్కీ ప్రదర్శన గురించి మీడియాతో మాట్లాడాడు. సిడ్నీ టెస్టులో అరంగేట్రం చేసిన విల్‌ పుకోస్కీ 26, 32 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచులను పంత్‌ వదిలేశాడు. దాంతో ఎంతో కష్టపడి బౌలింగ్‌ వేసిన అశ్విన్‌, సిరాజ్‌ అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే.

"టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ప్రపంచంలో మరే కీపర్‌ వదిలేయనన్ని క్యాచులను పంత్‌ జారవిడిచాడు. కీపింగ్‌లో మరింత మెరుగవ్వాల్సిన పరిస్థితిని ఇది ఎత్తిచూపుతోంది. తొలిరోజు వదిలేసిన రెండు క్యాచులు నిజానికి ఒడిసిపట్టాల్సినవి. ఎందుకంటే అవెంతో తేలికైన క్యాచులు"

-రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు.

"పిచ్‌ను చూస్తుంటే పంత్‌ బతికిపోయాడనే చెప్పొచ్చు. లేదంటే పుకోస్కీ భారీ శతకం లేదా ద్విశతకం కచ్చితంగా చేసేవాడు. ఎందుకంటే వికెట్‌ నమ్మశక్యం కానంత బాగుంది. ఆ రెండు క్యాచులు వదిలేయగానే అతడి ప్రదర్శన గురించి పంత్‌ చెత్తగా అనుకొని ఉంటాడు. 'ఇక నా పని అయిపోయినట్టే. పుకోస్కీ నాకు తగిన మూల్యం చెల్లిస్తాడు' అని ఆలోచించి ఉంటాడు. కానీ అలా జరగలేదు. పంత్‌ కీపింగ్‌పైనే ఆందోళన నెలకొందని నేనెప్పటి నుంచో చెబుతున్నా" అని పాంటింగ్‌ అన్నాడు.

ఇదీ చదవండి:ఐపీఎల్: ఆటగాళ్ల రిటెన్షన్​కు ఆఖరు తేదీ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.