ETV Bharat / sports

Ind vs Wi T20 : చెలరేగిన పూరన్.. రెండో టీ20లోనూ భారత్​పై విండీస్ విజయం..

author img

By

Published : Aug 7, 2023, 6:55 AM IST

Updated : Aug 7, 2023, 7:10 AM IST

Ind vs Wi T20
రెండో టీ20లోనూ భారత్​పై విండీస్ విజయం

Ind vs Wi T20 : వెస్టిండీస్ పర్యటనలో భారత్ మళ్లీ నిరాశ పర్చింది. బ్యాటర్లు పేలవ ఫామ్​ను కొనసాగించిన వేళ.. రెండో టీ20లో టీమ్ఇండియా పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 2-0 వెస్టిండీస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Ind vs Wi T20 :విండీస్​తో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 2 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణిత 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అనంతరం అతిథ్య జట్టు 18.5 ఓవర్లలోనే టార్గెట్​ను ఛేదించింది. 'మ్యాన్ ఆఫ్​ ది మ్యాచ్' విన్నర్.. విండీస్ డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్ (67 పరుగులు: 40 బంతుల్లో, 6x4,4x6) బ్యాట్​తో విధ్వంసం సృష్టించి.. తమ జట్టుకు విజయం కట్టబెట్టాడు. దీంతో భారత్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకొని ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 2-0తో వెనుకబడిపోయింది.

పూరన్ బాదేశాడు..
టీమ్ఇండియా బౌలర్లు రెండో ఇన్నింగ్స్​ను ఘనంగానే​ ఆరంభించారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య.. తొలి ఓవర్​లోనే రెండు వికెట్లు నేలకూల్చాడు. మొదటి బంతికే విండీస్ ఓపెనర్ బ్రెండన్ కింగ్​ను పెవిలియన్ చేర్చగా.. నాలుగో బంతికి చార్లెస్​ను ఎల్బీగా ఔట్ చేశాడు. దీంతో నాలుగో వికెట్​గా క్రీజులోకి వచ్చిన పూరన్ జట్టును ఆదురునే బాధ్యతలు తీసుకున్నాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ.. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు.

స్పిన్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్​లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఓవర్​లో పూరన్.. 3 ఫోర్లు, 1 సిక్స్​తో 18 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్ మళ్లీ భారత్​కు బ్రేక్ ఇచ్చాడు. రోమన్ పావెల్ (21)ను ఔట్ చేశాడు. కానీ అప్పటికీ విండీస్ సాధించాల్సిన రన్​రేట్ పెద్దగా ఏమీలేదు. ఇక పావెల్ ఔట్​ అయిన వెంటనే క్రీజులోకి వచ్చిన హెట్​మయర్ (22).. పూరన్​తో జత కట్టాడు. తర్వాత పూరన్, హెట్​మయర్, షెఫర్డ్‌ (0), హోల్డర్‌ (0) వికెట్లు తీసిన భారత్.. పోటీలోకి వచ్చినట్టు కనిపించింది. కానీ విండీస్ లోయార్డర్​ బ్యాటర్​లు అకీల్‌ (16*), జోసెఫ్‌ (10*)లు తమ పోరాటంతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో పాండ్య 3, చాహల్ 2, అర్షదీప్, బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​కు.. ఆశించిన ఆరంభం లభించలేదు. శుభ్​మన్ గిల్ (7) మరోసారి నిరాశ పర్చగా.. వన్​ డౌన్​లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (1) రనౌటయ్యాడు. దీంతో 18 పరుగులకే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్​కు వచ్చిన తిలక్ వర్మ(51; 41 బంతుల్లో 4x5, 1x6) తో కలిసి.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (27) ఫర్వాలేదనిపించాడు.

కాగా మరోవైపు తిలక్ మరోసారి కీలకమైన ఇన్నింగ్స్​ ఆడాడు. అంతర్జాతీయ కెరీర్​లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. తిలక్ ఔటైన తర్వాత హార్దిక్ (24) జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశాడు. కానీ జోసెఫ్ బౌలింగ్​లో క్లీన్​బౌల్డ్ అయ్యాడు. ఆఖర్లో బౌలర్లు అర్ష్‌దీప్‌ ఓ ఫోర్, బిష్ణోయ్‌ సిక్స్​ కొట్టడం వల్ల జట్టు స్కోర్ 150 పరుగులు దాటింది. వింజీస్ బౌలర్లలో జోసెఫ్, అకీల్, షెపర్డ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఇరుజట్ల మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్​ జరగనుంది.

ఇవి చదవండి :

Ind vs Wi T20 : ఆసక్తికరంగా రెండో టీ20.. ఈ మ్యాచ్​లోనైనా కుర్రాళ్లు కొట్టేస్తారా?

Ind Vs WI T20 : టీమ్​ఇండియా @200.. టీ20ల్లో మన స్టార్ ప్లేయర్ల రికార్డులు తెలుసా?

Last Updated :Aug 7, 2023, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.