ETV Bharat / sports

IND vs WI 2nd ODI: టాస్​ గెలిచిన వెస్టిండీస్​.. భారత్ బ్యాటింగ్

author img

By

Published : Feb 9, 2022, 1:29 PM IST

Updated : Feb 9, 2022, 1:46 PM IST

IND vs WI 2nd ODI: రెండో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్​ బౌలింగ్​ ఎంచుకుంది. ఇప్పటికే తొలి మ్యాచ్​ గెలిచిన భారత్.. ఇందులోనూ గెలవాలని చూస్తోంది.

IND vs WI 2nd ODI
IND vs WI 2nd ODI

IND vs WI 2nd ODI: తొలి వన్డేలో ఓటమి పాలైన వెస్టిండీస్​.. కీలకమైన రెండో వన్డేలో గెలవాలని భావిస్తోంది. అందులో భాగంగా బుధవారం భారత్​ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన విండీస్​ బౌలింగ్​ ఎంచుకుంది. దీంతో రోహిత్​ సేన బ్యాటింగ్​కు దిగనుంది.

భారత్​తో జట్టులో స్వల్పమార్పులు జరిగాయి. వ్యక్తిగత కారణాల వల్ల తొలివన్డేకు దూరమైన కేఎల్​ రాహుల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. దీంతో ఇషాన్ కిషన్​ను పక్కనపెట్టారు. విండీస్‌ కెప్టెన్‌ పొలార్డ్‌ ఈ మ్యాచ్‌కు దూరమవడం వల్ల నికోలస్‌ పూరన్‌ జట్టు పగ్గాలు చేపట్టాడు.

తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్​ అదే జోరు కొనసాగించాలని భావిస్తుండగా.. విండీస్ మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

జట్లు

భారత్

రోహిత్ శర్మ(కెప్టెన్​), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

వెస్టిండీస్

షాయ్ హోప్(కీపర్​), బ్రాండన్ కింగ్, డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్, నికోలస్ పూరన్(కెప్టెన్​), జాసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్, అకేల్ హోసేన్, ఫాబియన్ అలెన్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్

ఇదీ చూడండి: భారత్​పై ప్రేమ.. విండీస్​ క్రికెటర్​ కుమార్తెకు ఇక్కడి గ్రౌండ్ పేరు

Last Updated : Feb 9, 2022, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.