ETV Bharat / sports

Ind vs SL Asian Games : అదరగొట్టిన అమ్మాయిలు.. ఫైనల్స్​లో లంకపై విజయం.. భారత్ ఖాతాలో మరో పసిడి

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 2:46 PM IST

Updated : Sep 25, 2023, 4:15 PM IST

Ind vs SL Asian Games : ఆసియా క్రీడల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన పోరులో భారత మహిళల జట్టు ఘన విజయాన్ని సాధించింది. 19 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. అలా క్రికెట్​ చరిత్రలో తొలి పసిడిని ముద్దాడింది.

Ind vs SL Asian Games
Ind vs SL Asian Games

Ind vs SL Asian Games : ఆసియా క్రీడల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన పోరులో భారత మహిళల జట్టుదే పైచేయి సాధించింది. లక్ష్యఛేదనలో లంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులను మాత్రమే చేయగలిగింది. 117 లక్ష్యంతో బరిలోకి దిగిన లంక సేన.. భారత బౌలర్ల దాటికి నిలవలేకపోయింది. దీంతో టీమ్ఇండియా 19 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గి క్రికెట్​ చరిత్రలో తొలి స్వర్ణ పతకం సాధించింది.

18 ఏళ్ల పేసర్ టిటాస్ సాధు.. చమరి ఆటపట్టు (12), అనుష్క సంజీవని (1), విష్మి గుణరత్నే (0)లను వరుస ఓవర్లలో ఔట్‌ చేసి శ్రీలంకకు గట్టి షాక్‌ ఇచ్చింది. దీంతో లంక తొలి 14 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన హాసిని పెరీరా (25), నీలాక్షి డి సిల్వా (23), ఓషది రణసింగ్ (19) ఆదుకున్నప్పటికీ.. తమ స్కోర్లతో జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఇక భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు పడగొట్టగా.. పూజా వస్త్రాకర్‌, దీప్తి శర్మ, దేవిక వైద్య చెరో వికెట్​ను తమ ఖాతాలో వేసుకున్నారు.

Ind Women Vs SL Women : టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. స్మృతి మంధాన (46), జెమీమా రోడ్రిగ్స్ (42) రాణించారు. ఇక షెఫాలీ వర్మ (9), హర్మన్ ప్రీత్ కౌర్ (2), రిచా ఘోష్ (9) నిరాశపరిచారు. స్పిన్ ట్రాక్ పై లంక అమ్మాయిలు అదరగొట్టారు. అయితే కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి.. టీమ్​ఇండియా భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. లంక బౌలర్లలో ఇనోకా, సుగంధిక, ప్రభోదని తలో రెండు వికెట్లు తీసి సత్తా చాటారు.

Ind Vs Ban Asian Games 2023 : అంతకుముందు జరిగిన సెమీస్‌లోనూ బంగ్లాదేశ్‌పై భారత్ సత్తా చాటింది. క్వార్టర్స్​లో ఓ పాయింట్​ అందుకుని సెమీస్​కు దూసుకెళ్లిన స్మృతి సేన.. ఆదివారం జరిగిన మ్యాచ్​లో బంగ్లా​ జట్టుపై అత్యద్భుత ప్రదర్శనను కనబరిచింది. 8 వికెట్ల తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. ఇక టాస్​ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు.. 17.5 ఓవర్లకు.. 51 పరగులు స్కోర్​ చేసి ఆలౌటైంది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు కెప్టెన్‌ స్మృతి మంధాన (7), షెఫాలీ వర్మ (17) తడబడినా.. జెమీమా రోడ్రిగ్స్‌ (20*), కనికా (1*) నాటౌట్‌గా నిలిచి మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేశారు.

  • 🇮🇳 𝑯𝒊𝒔𝒕𝒐𝒓𝒚-𝒎𝒂𝒌𝒆𝒓𝒔!

    The incredible women's cricket team of India strike GOLD for the first time ever, clinching a thrilling victory against Sri Lanka! 🥇🎉 Let's celebrate these remarkable women who've made India proud at #AsianGames2022! 🥳👏 #Cheer4India pic.twitter.com/0xUrGdgfbA

    — SAI Media (@Media_SAI) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Asian Games 2023 : ఆసియా క్రీడల్లో పతకాల వేట షురూ.. భారత్​ ఖాతాలోకి మెడల్స్ వెల్లువ​

Asian Games 2023 : రోయర్ల జోరు.. షూటర్ల హోరు.. తొలి రోజు భారత్​కు ఐదు పతకాలు

Last Updated :Sep 25, 2023, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.