ETV Bharat / sports

తొలి రోజు బౌలర్లదే హవా- పేసర్ల దెబ్బకు 23 వికెట్లు డౌన్- 36 పరుగుల వెనుకంజలో సౌతాఫ్రికా

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 10:18 PM IST

Updated : Jan 3, 2024, 10:45 PM IST

Ind vs Sa 2nd Test 2024
Ind vs Sa 2nd Test 2024

Ind vs Sa 2nd Test 2024: కేప్​టౌన్​ వేదికగా జరుగుతున్న టెస్టు తొలి రోజు ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా 36 పరుగులు వెనుకంజలో ఉంది. పూర్తిగా పేస్​కు అనుకూలిస్తున్న పిచ్​పై తొలిరోజే 23 వికెట్లు నేలకూలాయి. ప్రస్తుతం సౌతాఫ్రికా 62-3తో బ్యాటింగ్ చేస్తోంది.

Ind vs Sa 2nd Test 2024: భారత్- సౌతాఫ్రితా రెండో టెస్టు తొలి రోజు ముగిసేసరికి ఆతిథ్య జట్టు 36 పరుగులు వెనకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్​లో 55 పరుగులకే ఆలౌటైన సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్​లో 62-3తో బ్యాటింగ్ చేస్తోంది. తొలి రోజు పూర్తిగా పేసర్లకు అనుకూలించిన పిచ్​పై ఇరుజట్ల బౌలర్లు చెలరేగిపోయారు. ఒక్క రోజే 23 వికెట్లు నేలకూల్చారంటే పిచ్ ఏ విధంగా పేసర్లకు సహకరించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎయిడెన్ మర్​క్రమ్ (36*), డేవిడ్ బెడింగమ్ (7*) క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా బౌలర్లు ముకేశ్ కుమార్ 2, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ దక్కించుకున్నారు.

భారత్ తొలి ఇన్నింగ్స్: తొలి ఇన్నింగ్స్​లో ప్రత్యర్థిని ఫస్ట్ సెషన్​లోనే ఆలౌట్​ చేసిన టీమ్ఇండియా, బ్యాటింగ్​లో ప్రభావం చూపలేకపోయింది. 34.5 ఓవర్లలో టీమ్ఇండియా 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (39 పరుగులు), యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ (36), విరాట్ కోహ్లీ (46) మినహా మిగతావారెవరూ రెండంకెల స్కోర్ సాధించలేదు. ముఖ్యంగా ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (0), శ్రేయస్ అయ్యర్ (0) ఇద్దరూ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. సఫారీ పేసర్ల దెబ్బకు టీమ్ఇండియాలో మొత్తం ఆరుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. దీంతో 153 పరుగుల వద్దే భారత్ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం గమనార్హం. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగ్డీ, కగిసో రబాడా, బర్గర్ తలో మూడు వికెట్లు దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాను, టీమ్ఇండియా బౌలర్లు శాసించారు. వాళ్ల దెబ్బక సఫారీ జట్టు 55 పరుగులకే చేతులేత్తేసింది. బెడింగమ్ (12), వెరినే (15) ఇద్దరే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. మహ్మద్ సిరాజ్ ఏకంగా 6 వికెట్లు నేలకూల్చి ప్రత్యర్థిని తీవ్రంగా దెబ్బ కొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 2, ముకేశ్ కుమార్ 2 వికెట్లు దక్కించుకున్నారు. కాగా, టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్​లో సౌతాఫ్రికాకు ఇదే అతి తక్కువ స్కోర్ కావడం విశేషం.

సౌతాఫ్రికా 55- భారత్ 153- తొలిరోజే ఇరుజట్లు ఆలౌట్- 98 రన్స్​ లీడ్​లో టీమ్ఇండియా

'టెస్టు క్రికెట్ ICUలో ఉంది- వారికి WTC కంటే డొమెస్టిక్ లీగ్​ ఎక్కువైంది!'

Last Updated :Jan 3, 2024, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.