ETV Bharat / sports

బెంబేలెత్తించిన అర్షదీప్, ఆవేశ్- టీమ్ఇండియా దెబ్బకు కుప్పకూలిన సఫారీ జట్టు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 4:05 PM IST

Updated : Dec 17, 2023, 5:03 PM IST

ind vs sa 1st odi 2023
ind vs sa 1st odi 2023

Ind vs Sa 1st ODI 2023 : జొహెన్నస్​బర్గ్​ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమ్ఇండియా బౌలర్ల దెబ్బకు సఫారీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. 27.3 ఓవర్లలో 116 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌటైంది.

Ind vs Sa 1st ODI 2023 : సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో టీమ్ఇండియా బౌలర్లు బెంబేలెత్తించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టును 27.3 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ చేశారు. యంగ్ పేసర్లు అర్షదీప్ సింగ్ 5, ఆవేశ్ ఖాన్ 4 వికెట్ల ప్రదర్శనతో సఫారీ గడ్డపై నిప్పులు చెరిగారు. కుల్​దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకు్న్నాడు. వీరి దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ విలవిల్లాడింది. ఏకంగా ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్​కు పరిమితమయ్యారు.

టాస్ నెగ్గి బ్యాటింగ్​కు దిగిన సౌతాఫ్రికాకు ఆరంభం నుంచే అర్షదీప్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్​ రెండో ఓవర్లోనే ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (0)ను డకౌట్​ చేయగా, మరుసటి బంతికే వన్​డౌన్​లో వచ్చిన రస్సీ వాన్​ డర్​ డస్సెన్​ (0)ను పరుగుల ఖాతా తెరవనివ్వలేదు. దీంతో సఫారీ జట్టు 3 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. తర్వాత మరో ఓపెనర్ టోని డి జోర్జీ (28) కాసేపు వికెట్ల పతనం అడ్డుకున్నా 7.5 బంతికి అర్షదీప్ మరోసారి టీమ్ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. కాసేపటికే హెన్రిచ్ క్లాసెన్ (6)ను క్లీన్​బౌల్డ్ చేసి 10 ఓవర్లలోపే సౌతాఫ్రికా 4 వికెట్లు కూల్చాడు. ఇక 11 ఓవర్​ బౌలింగ్ చేసిన ఆవేశ్ ఖాన్, వరుస తొలి రెండు బంతుల్లో ఎయిడెన్ మర్​క్రమ్ (12), వియాన్ ముల్దార్ (0)ను పెవిలియన్ చేర్చి సౌతాఫ్రికాను కోలుకొని దెబ్బకొట్టాడు.

ఇక తన తర్వాతి ఓవర్లోనే ఆవేశ్, డేవిడ్ మిల్లర్ (2)ను వెనక్కిపంపాడు. కాసేపు టెయిలెండర్ ఫెలుక్వాయో (33) కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. జట్టులో ఫెలుక్వాయోనే టాప్​ స్కోరర్​. అతడి వల్లే స్కోర్ 100 పరుగులు దాటింది. చివరికి అతడ్ని ఎల్​బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చిన అర్షదీప్, వన్డే కెరీర్​లో నాలుగో మ్యాచ్​లోనేే 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇక స్పిన్నర్ కుల్​దీప్ యాదవ్ ఆఖరి వికెట్ పడగొట్టి సఫారీ ఇన్నింగ్స్​కు తెర దించాడు.

వరల్డ్​ కప్​ తర్వాత ఫస్ట్ వన్డే- యువ భారత్​కు గట్టి సవాల్​- ఏం చేస్తారో?

ఏకైక టెస్ట్ మ్యాచ్​లో టీమ్ఇండియాదే పైచేయి- 347పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ చిత్తు

Last Updated :Dec 17, 2023, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.