ETV Bharat / sports

Ind vs Pak World Cup 2023 Ceremony : 'భారత్-పాకిస్థాన్​ మ్యాచ్ అంత స్పెషలా'?.. బీసీసీఐపై ఫ్యాన్స్ గరం!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 11:12 AM IST

Updated : Oct 14, 2023, 11:39 AM IST

Ind vs Pak World Cup 2023 Ceremony
Ind vs Pak World Cup 2023 Ceremony

Ind vs Pak World Cup 2023 Ceremony : 2023 ప్రపంచకప్​లో భారత్-పాక్​ మ్యాచ్​కు ముందు ఈవెంట్​ నిర్వహించాలని ఐసీసీ, బీసీసీఐ భావించింది. అయితే ఈ నిర్ణయంపై పలువురు క్రీడా విశ్లేషకులు, అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

Ind vs Pak World Cup 2023 Ceremony : 2023 వరల్డ్​కప్​లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్​ వేదికగా భారత్-పాకిస్థాన్​ మ్యాచ్ జరగనున్నట్లు తెలిలిందే. అయితే బీసీసీఐ, ఐసీసీ.. ఈ దాయాదుల సమరానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రముఖులు, బాలీవుడ్ నటీనటులు, సింగర్లు, డ్యాన్సర్లు ఈ ఈవెంట్​కు హాజరు కానున్నారని కొన్ని కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్.. శనివారం ఉదయం అహ్మదాబాద్​కు చేరుకున్నారు.

అయితే టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఎలాంటి ఈవెంట్​ జరపకపోగా.. ప్రత్యేకంగా భారత్-పాక్ మ్యాచ్​కు మాత్రమే ఇలా చేస్తుండడం పట్ల సోషల్ మీడియాలో బీసీసీఐ, ఐసీసీపై విమర్శలు వస్తున్నాయి. క్రికెట్​లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ప్రపంచకప్​లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను ప్రత్యేకంగా ట్రీట్ చేయడం.. క్రికెట్‌ ప్రపంచంలో చర్చకు దారి తీసింది. వరల్డ్​కప్​లో అన్ని జట్లను సమానంగా చూడాలని, ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ కాదని, నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని.. కానీ ప్రస్తుత వరల్డ్​కప్​లో సమన్యాయం కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్వయంగా భారత్ ఫ్యాన్స్​ కూడా ఈ విషయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

బలంగా టీమ్ఇండియా బ్యాటింగ్ ! చిరకాల ప్రత్యర్థుల పోరులో టీమ్ఇండియాదే పైచేయిగా కనిపిస్తోంది. గత మ్యాచ్​తో కెప్టెన్ రోహిత్ కూడా ఫామ్​లోకి రావడం కలిసొచ్చే అంశం. ఇక వన్​డౌన్, మిడిల్ ఆర్డర్​లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఉండనే ఉన్నారు. ఆల్​రౌండర్లు హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా జట్టుకు కీలకం కానున్నారు.

బౌలింగ్ దళం పటిష్ఠంగా.. టీమ్ఇండియా పేస్ బౌలింగ్ ప్రస్తుతం పటిష్ఠంగా ఉందని.. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కితాబిచ్చాడు. జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.. ప్రత్యర్థి జట్టు బౌలర్లకంటే మెరుగ్గా ఆడుతున్నారని.. వారు చెలరేగితే పాక్​ బ్యాటర్లకు కష్టాలు తప్పవని గంభీర్ అన్నాడు. ఇక అహ్మదాబాద్ పిచ్ స్పిన్​కు అనుకూలిస్తుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అయితే అదే నిజమైతే అశ్విన్ తప్పుకుండా తుది జట్టులో ఉండే ఛాన్స్​ ఉంది.​

  • First, having reserve day only for IND v PAK match in Asia Cup

    Now, no opening ceremony ahead of the tournament but ceremony before IND v PAK match

    This is disgraceful. I’m sure even fans of both the countries would feel embarrassed !! https://t.co/Fyx4YIqaGj

    — Nafiu Kabir (@NafiuKaabir) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Ind vs Pak ODI World : భారత్-పాకిస్థాన్ ప్రపంచకప్ పోరు.. ఆ రికార్డులో సచిన్​దే జోరు.. రోహిత్-విరాట్ స్థానం ఎంతంటే?

దేశంలో​ ఇండో-పాక్ మ్యాచ్​ మేనియా.. భారత్​ గెలవాలంటూ పూజలు, హోమాలు.. స్టేడియం వద్ద సందడి షురూ

Last Updated :Oct 14, 2023, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.