ETV Bharat / sports

ICC World Cup 2023 India Squad : అక్షర్​ స్థానంలో అశ్విన్​.. జట్టులో మార్పునకు కారణం అదే!.. 'ఈటీవీ భారత్'​ ఎక్స్​క్లూసివ్

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 7:38 PM IST

ICC World Cup 2023 India Squad : వరల్డ్​ కప్​ 2023 ముంగిట బీసీసీఐ టీమ్ఇండియా జట్టులో మార్పులు చేసింది. అక్షర్​ పటేల్​ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్​ను జట్టులోకి తీసుకుంది. అయితే అశ్విన్​.. వరల్డ్ కప్ స్క్వాడ్​లోకి వచ్చే క్రమంలో జరిగిన పరిణామాలను ఓ బీసీసీఐ ప్రతినిధి 'ఈటీవీ భారత్'​కు ప్రత్యేకంగా తెలిపారు. ఆ వివరాలు..

ICC World Cup 2023 India Squad ashwin
ICC World Cup 2023 India Squad ashwin

ICC World Cup 2023 India Squad : ఆసియా కప్​ 2023 సూపర్​ 4 స్టేజ్​లో బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా బౌలర్​ అక్షర్​ పటేల్​ గాయపడ్డాడు. దీంతో బీసీసీఐ భారత వరల్డ్​ కప్​ స్క్వాడ్​ను మార్చాల్సి వచ్చింది. అందులో భాగంగా సీనియర్​ ప్లేయర్​ రవిచంద్రన్ అశ్విన్​ను జట్టులోకి తీసుకున్నారు. అయితే, అక్షర్​ పటేల్​ స్థానంలో అశ్విన్​ జట్టులోకి వచ్చే క్రమంలో జరిగిన పరిణామాలను బీసీసీఐ అధికారి ప్రత్యేకంగా 'ఈటీవీ భారత్​'కు తెలిపారు.

సెప్టెంబర్ 5న బీసీసీఐ వరల్డ్​ కప్​ 2023 జట్టును ప్రకటించింది. ఇందులో ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజాతో పాటు అక్షర్ పటేల్​ను రెండో స్పిన్నర్​గా తీసుకున్నారు. అక్షర్​ పటేల్​ గాయం కారణంగా పరిస్థితులు మారాయి. అతడు కోలుకోవడానికి 4-5 వారాల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో తమకు వేరే మార్గం కనబడలేదని.. అందుకే సీనియర్​ ప్లేయర్, ​మంచి అనుభవం కలిగిన రవిచంద్రన్ అశ్విన్​ను జట్టులోకి తీసుకున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బీసీసీఐ అధికారి 'ఈటీవీ భారత్'​కు చెప్పారు.

"అక్షర్​కు గాయం అయిన తర్వాత అశ్విన్​ను జట్టులోకి తీసుకోవడం కోసం టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్​ శర్మ అతడిని సంప్రదించాడు. అయితే, ఫిట్​నెస్​ సాధించేందుకు తనకు కొంత సమయం కావాలని అశ్విన్​.. రోహిత్​ను అడిగాడు. ఆ తర్వాత జట్టు కూర్పుపై తీవ్ర కసరత్తు చేసి, లెక్కలు వేసుకుని.. నలుగురు పేసర్లతో పాటు ఒక ఆఫ్​ స్పిన్నర్​, లెఫ్ట్​ హ్యాండ్ స్నిన్నర్​తో స్క్వాడ్​ ఎంపిక పూర్తి చేశాం" అని ఆ బీసీసీఐ అధికారి వివరించారు.

World Cup 2023 India Matches : ఆసియా కప్ 2023 తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ- ఎన్​సీఏలో అశ్విన్​ శిక్షణ తీసుకుంటున్నాడు. వరల్డ్ కప్​ 2023లో భాగంగా ఐదుసార్లు మెగా టోర్నీ ఛాంపియన్​గా నిలిచిన ఆస్ట్రేలియాతో అక్టోబర్​ 8న చెన్నైలో జరిగే మ్యాచ్​లో అశ్విన్​ అందుబాటులో ఉంటాడు.

వరల్డ్​ కప్ 2023 భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్​ కీపర్​), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (వైస్​ కెప్టెన్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్​ప్రీత్ బుమ్రా.

World Cup 2023 Tickets : ప్రపంచకప్​నకు బీసీసీఐ రెడీ.. టికెట్ల విక్రయాలు అప్పటినుంచే..

BCCI Team India : ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఆ మాస్టర్​ ప్లాన్​తో టీమ్ఇండియా ఓ మెట్టు పైకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.