ETV Bharat / sports

బిష్ణోయ్ కెరీర్ బెస్ట్ పొజిషన్ - తొలిసారి టాప్​ ప్లేస్​కు - టీ20 ర్యాంకింగ్స్ రిలీజ్

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 3:03 PM IST

Updated : Dec 6, 2023, 3:32 PM IST

ICC T20 Ranking : ఐసీసీ టీ20 తాజాగా టీ20 ర్యాంకింగ్స్​ రిలీజ్ చేసింది. లేటెస్ట్ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

icc t20 ranking
icc t20 ranking

ICC T20 Ranking : ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్​లో, టీమ్ఇండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అతడు 699 రేటింగ్స్​తో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 855 రేటింగ్స్​తో టాప్​ ప్లేస్​ను పదిలం చేసుకున్నాడు. దీంతో టీ20 ర్యాంకింగ్స్​లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమ్ఇండియా ప్లేయర్లే టాప్​లో ఉండడం విశేషం.

Ravi Bishnoi T20 Career : 23 ఏళ్ల బిష్ణోయ్, గతేడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్​పై టీ20 మ్యాచ్​తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్​లోనే 2 వికెట్ల ప్రదర్శన చేశాడు బిష్ణోయ్. కెరీర్​లో ఇప్పటివరకూ 21 మ్యాచ్​ల్లో అతడు, 34 వికెట్లు పడగొట్టాడు. ఇక రీసెంట్​గా ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్​లో 9 వికెట్లు పడగొట్టి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పొందిన విషయం తెలిసిందే. ఇక 692 రేటింగ్స్​తో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే బౌలింగ్ విభాగంలో బిష్ణోయ్, రషీద్ ఖాన్​ సహా టాప్ 5 గురు బౌలర్లు స్పిన్నర్లే కావడం గమనార్హం.

టాప్ - 5 బౌలర్లు

  • తొలి స్థానం - రవి బిష్ణోయ్ - 699 రేటింగ్స్​
  • రెండో స్థానం - రషీద్ ఖాన్ - 692 రేటింగ్స్
  • మూడో స్థానం - వానిందు హసరంగ - 679 రేటింగ్స్
  • నాలుగో స్థానం - ఆదిల్ రషీద్ - 679 రేటింగ్స్
  • ఐదో స్థానం - మహీషా తీక్షణ - 677 రేటింగ్స్

టాప్ - 5 బ్యాటర్లు

వెస్టిండీస్​ సిరీస్​కు భారత జట్టు.. కుల్దీప్ రీఎంట్రీ, బిష్ణోయ్​కు పిలుపు

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ: సై అంటున్న కుర్రాళ్లు

Last Updated : Dec 6, 2023, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.