ETV Bharat / sports

'అవును.. ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని!'

author img

By

Published : Aug 12, 2021, 7:20 PM IST

ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో తాను ఒకడినని ప్రముఖ భారత ఆల్​రౌండర్ జడేజా అంటున్నాడు​. శారీరక శ్రమ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్​పై విజయం సాధించేందుకు టీమ్​ ఇండియాకే మెరుగైన అవకాశాలున్నాయని తెలిపాడు.

RAVINDRA JADEJA
రవీంద్ర జడేజా, భారత్​ ఫీల్డింగ్​, ఇండియా క్రికెటర్​

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజేతగా నిలిచేందుకు తనవంతు కృషి చేస్తానని సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చెబుతున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో తానూ ఒకడినని అంటున్నాడు. సరైన దేహదారుఢ్యంతో ఉండేందుకు ఎంతో కృషి చేస్తానని, విరాట్‌ కోహ్లీ అందరికీ ప్రేరణనిచ్చాడని వెల్లడించాడు.

RAVINDRA JADEJA
జడ్డూ ఫీల్డింగ్​

''అవును, ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని. కానీ నేనిక్కడితోనే ఆగిపోను. నిరంతరం నా ఆట, ఫిట్‌నెస్‌పై శ్రమిస్తాను. ఇందుకోసం నేను విపరీతంగా భుజాల కసరత్తులు చేస్తాను. తరచూ పరుగెత్తుతాను. అలా కష్టపడతాను కాబట్టే ఫీల్డింగ్‌ బాగుంటుంది''

- రవీంద్ర జడేజా

విరాట్‌ కోహ్లీ మైదానంలో ఉత్సాహంగా ఉంటాడని జడ్డూ అన్నాడు. అతడెంతో దృఢంగా, చైతన్యంతో ఉంటాడని వెల్లడించాడు. ఫిట్‌నెస్‌ను అతడు ఎక్కువగా విశ్వసిస్తాడని అందువల్లే జట్టులో అంతా తమ ఫిట్‌నెస్‌ ప్రమాణాలు పెంచుకున్నారని అన్నాడు. ప్రతి ఒక్కరు శారీరకంగా శ్రమిస్తున్నారు కాబట్టే మైదానంలో ఇప్పుడు తేడా కనిపిస్తోందని పేర్కొన్నాడు.

RAVINDRA JADEJA
రవీంద్ర జడేజా

ఇదీ చూడండి: పెళ్లి తర్వాత రోహిత్​లో ఇంత మార్పా?

ప్రపంచకప్‌ ముందు ఐపీఎల్‌ ఆడటం ఉపయోగకరమని జడ్డూ అన్నాడు.

''ఇదో మంచి అవకాశం. టీ20 ప్రపంచకప్‌లో నా జట్టును గెలిపించేందుకు ఉపయోగపడుతుంది. అవకాశం దొరికిన ప్రతిసారీ వందశాతం గెలిపించేందుకే ప్రయత్నిస్తా. ప్రపంచకప్‌లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తా''

- రవీంద్ర జడేజా

ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా విజయం సాధించేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని జడ్డూ అంటున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌లో జట్టు అద్భుతంగా ఉందన్నాడు. జట్టు సమతూకమూ పెరిగిందని వెల్లడించాడు. వాతావరణం కలిసొస్తే కోహ్లీసేన విజయ దుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

RAVINDRA JADEJA
రవీంద్ర జడేజా బ్యాటింగ్​

ఇదీ చూడండి: ప్రపంచ అథ్లెటిక్స్​ ర్యాంకింగ్స్​లో దుమ్మురేపిన నీరజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.