ETV Bharat / sports

రెండో పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్లు వీరే!

author img

By

Published : Sep 9, 2021, 3:22 PM IST

సానియా మీర్జాతో షోయబ్​ మాలిక్​ది రెండో (cricketers who married twice) పెళ్లా? యువరాజ్​ సింగ్ తల్లికి విడాకులు ఇచ్చి ఆయన తండ్రి యోగ్​రాజ్​ మరో వివాహం చేసుకున్నారా? దినేశ్ కార్తిక్​తో కల్యాణం జరిగిన తర్వాత అతడి భార్య మరో టీమ్​ఇండియా క్రికెటర్​ని ప్రేమించింది.. అతను ఎవరు? ఇలాంటి ఆసక్తికర అంశాలు మీకోసం..

cricketers who married twice
సానియా మిర్జా

అభిప్రాయ భేదాల వల్ల కావొచ్చు మరే ఇతర కారణాల వల్ల అయినా కావొచ్చు.. విడాకులకు, రెండో పెళ్లికి క్రికెటర్లూ (cricketers who married twice) అతీతం కాదు. అలా రెండోసారి వివాహం చేసుకున్న క్రికెటర్లు ఎవరో ఓ లుక్కేయండి.

1. యోగ్​రాజ్​ సింగ్

మాజీ క్రికెటర్ యోగ్​రాజ్​ సింగ్​.. భారత్​ తరఫున ఒక టెస్టు మ్యాచ్, 6 వన్డేలు ఆడారు. ఆయన తొలుత శబ్నంను (యువరాజ్​ సింగ్ తల్లి) పెళ్లాడారు. అనంతరం విడాకులు తీసుకున్నారు.

cricketers who married twice
యోగ్​రాజ్​ సింగ్

ప్రస్తుతం యోగ్​రాజ్​ సత్​వీర్​ కౌర్​తో వివాహబంధంలో ఉన్నారు. గాయం కారణంగా క్రికెట్​ నుంచి వైదొలిగిన ఆయన నటుడిగా పంజాబీ, బాలీవుడ్​ సినిమాల్లో కొనసాగుతున్నారు.

2. దినేశ్ కార్తిక్

టీమ్​ఇండియా వికెట్​కీపర్ బ్యాట్స్​మన్ దినేశ్ కార్తిక్ తొలుత నిఖిత వంజరను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె మరో భారత క్రికెటర్​ మురళి విజయ్​ ప్రేమలో పడి, దినేశ్ నుంచి విడాకులు తీసుకుంది. ఈ తర్వాత 2015లో భారత స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్​ను వివాహమాడాడు దినేశ్

cricketers who married twice
దినేశ్ కార్తిక్

3. మహ్మద్ అజారుద్దీన్

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తొలుత నౌరీన్​ను పెళ్లి చేసుకున్నారు. వారికి అసద్, అయాజ్ అనే ఇద్దరు పిల్లలున్నారు.

cricketers who married twice
మహ్మద్ అజారుద్దీన్

అయితే 1996లో బాలీవుడ్ నటి సంగీత బిజ్లానీతో అజర్ ప్రేమాయణం వల్ల ఆయన మొదటి వివాహా బంధానికి స్వస్తి చెప్పారు. 2010లో సంగీతకు కూడా విడాకులిచ్చారు.

4. వసీం అక్రమ్

సైకాలజిస్ట్ హ్యూమా ముఫ్టీని 1996లో పెళ్లి చేసుకున్నారు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్. అయితే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్​ వల్ల ఆమె 2009లో మరణించారు.

cricketers who married twice
వసీం అక్రమ్

2013లో షానియరా థాంప్సన్​ను వివాహం చేసుకొని సరికొత్త జీవితం ప్రారంభించారు అక్రమ్. వారికి 2014లో ఓ పాప జన్మించింది.

5. షోయబ్ మాలిక్

cricketers who married twice
షోయబ్ మాలిక్

సానియా మీర్జా కన్నా ముందు పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్​.. అయేషా సిద్ధిఖీ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. 2010లో సానియాను వివాహం చేసుకున్న తర్వాత అతడిపై కేసు పెట్టారు అయేషా. 2002లో తనకు షోయబ్​తో కల్యాణం జరిగిందని అయేషా పేర్కొన్నారు. ఈ వివాదం తర్వాత అయేషాకు అధికారికంగా విడాకులిచ్చాడు షోయబ్.

6. వినోద్ కాంబ్లీ

తొలుత చిన్ననాటి స్నేహితురాలు నొయెల్లా లూయిస్​ను పెళ్లిచేసుకున్నాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ. అయితే ఆండ్రియా హెవిట్​ అనే మోడల్​తో ఆయన సంబంధం పెట్టుకోవడం వల్ల వారి పెళ్లి కుప్పకూలింది.

cricketers who married twice
వినోద్ కాంబ్లీ

విడాకులు తీసుకున్న అనంతరం ఆండ్రియాను వివాహం చేసుకున్నాడు కాంబ్లీ. వారికి 2010లో ఓ బిడ్డ జన్మించింది.

ఇదీ చూడండి: షోయబ్ మాలిక్ టు ధావన్.. విడాకులు తీసుకున్న స్టార్ క్రికెటర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.