ETV Bharat / sports

'మా వాళ్లను క్షేమంగా పంపారు.. థ్యాంక్యూ బీసీసీఐ'

author img

By

Published : May 17, 2021, 3:34 PM IST

ఐపీఎల్​ అనంతరం తమ ఆటగాళ్లను సురక్షితంగా స్వదేశానికి చేర్చినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపారు క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లీ. ఆసీస్​కు చెందిన మొత్తం 38 మంది ఈ సారి లీగ్​లో పాల్గొన్నారు.

cricket australia, interim ceo
క్రికెట్ ఆస్ట్రేలియా, తాత్కాలిక సీఈఓ నిక్​ హాక్లీ

భారత క్రికెట్​ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)కు ధన్యవాదములు తెలిపారు క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ నిక్​ హాక్లీ. తమ ఆటగాళ్లను క్షేమంగా, త్వరగా స్వదేశానికి చేర్చడం బీసీసీఐ గొప్పతనమని పేర్కొన్నారు.

"మాకు సంతోషంగా ఉంది. మా క్రికెటర్లను క్షేమంగా, త్వరగా స్వదేశానికి చేరవేసినందుకు బీసీసీఐకి ధన్యవాదములు. ఇది ఆ బోర్డు గొప్పతనం. వారిక్కడికి వచ్చిన దగ్గరి నుంచి నేను వారితో ఇంకా మాట్లాడలేదు. స్వదేశానికి చేరినందుకు వారెంతో ఉపశమనం పొంది ఉంటారు."

-నిక్ హాక్లీ, క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ.

కొవిడ్​ నేపథ్యంలో ఐపీఎల్​ను మే 4న నిరవధిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అదే సమయంలో భారత్ నుంచి ఆస్ట్రేలియాకు విమానాల రాకపోకలను నిషేధించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఆటగాళ్లతో పాటు కోచ్​లు, వ్యాఖ్యతలు.. మొత్తం 38 మంది లీగ్​లో పాల్గొన్నారు. వారిని స్వదేశానికి పంపించే బాధ్యతను భారత క్రికెట్ బోర్డు తీసుకుంది. తొలుత వారిని మాల్దీవులకు పంపించి.. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు చేరవేసింది.

ఇదీ చదవండి: జడేజాను అనుకరించిన ధోనీ.. జడ్డూ ఫన్నీ రిప్లై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.