ETV Bharat / sports

గౌతమ్‌ గంభీర్‌కు ప్రమోషన్.. ఆర్​పీఎస్​జీ గ్లోబల్ మెంటార్‌గా బాధ్యతలు

author img

By

Published : Oct 7, 2022, 8:23 PM IST

Gautam Gambhir
గౌతమ్ గంభీర్

టీమ్ ​ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్​ కొత్త బాధ్యతలు అప్పగించింది భారత టీ20 లీగ్ ఫ్రాంచైజీ ఆర్​పీఎస్​జీ గ్రూప్. తమ ఫ్రాంచైజీ క్రికెటింగ్ ఆపరేషన్స్​కు గ్లోబల్ మెంటార్​గా గంభీర్​ను నియమించింది.

టీమ్‌ ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌కు కొత్త బాధ్యతలను అప్పగిస్తూ భారత టీ20 లీగ్‌ ఫ్రాంచైజీ ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌ నిర్ణయం తీసుకుంది. తమ ఫ్రాంచైజీ క్రికెటింగ్‌ ఆపరేషన్స్‌కు గ్లోబల్‌ మెంటార్‌గా నియమించింది. ప్రస్తుతం గంభీర్‌ లఖ్‌నవూ జట్టుకు మెంటార్‌గా ఉన్నారు. ఇప్పుడు గ్లోబల్ మెంటార్‌గా నియమించడంతో దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లోనూ డర్బన్ సూపర్‌ జెయింట్స్‌కు మార్గనిర్దేశకుడిగా వ్యవహరిస్తాడు.

టీమ్‌ ఇండియా పొట్టి ప్రపంచకప్‌ నెగ్గిన జట్టులో సభ్యుడైన గౌతమ్‌ గంభీర్‌ చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. అలాగే 2011 వన్డే వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌లోనూ ఉన్నాడు. భారత టీ20 లీగ్‌లో కోల్‌కతాను రెండుసార్లు విజేతగా నిలిపిన అనుభవం గంభీర్‌ సొంతం. గత సీజన్‌లో కొత్తగా చేరిన లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో గంభీర్‌కు ప్రమోషన్‌ ఇస్తూ.. అంతర్జాతీయ మెంటార్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో గంభీర్ స్పందిస్తూ.. "నా అభిప్రాయం ప్రకారం హోదాలు జట్టుకు సంబంధించి పెద్దగా పాత్ర పోషించవు. టీమ్‌ సభ్యులకు మార్గనిర్దేశకం చేస్తూ విజయం వైపు నడిపించడంపైనే దృష్టిపెడతా. గ్లోబర్‌ మెంటార్‌గా అదనపు బాధ్యతలు తీసుకోవడం గర్వంగా ఫీలవుతున్నా. సూపర్‌ జెయింట్‌ కుటుంబం నా పట్ల విశ్వాసం ఉంచడం ఆనందంగా ఉంది" అని అధికారిక ప్రకటన విడుదల చేశాడు.

ఇవీ చదవండి: ఆసియా కప్​లో భారత మహిళల జట్టుపై పాక్​ గెలుపు

'రుతురాజ్‌-ఇషాన్‌.. అది మంచి పద్ధతి కాదయ్యా'.. నెట్టింట ఫుల్​ ట్రోలింగ్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.