ETV Bharat / sports

ఫిట్​నెస్​ టెస్ట్​ పాస్​.. పింక్​-టెస్టుకు ఉమేశ్​!

author img

By

Published : Feb 23, 2021, 7:12 AM IST

Updated : Feb 23, 2021, 7:28 AM IST

అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరగనున్న మిగిలిన రెండు టెస్టుల్లో ఫాస్ట్​బౌలర్​ ఉమేశ్​ యాదవ్​కు చోటుదక్కింది. సోమవారం బీసీసీఐ నిర్వహించిన ఫిట్​నెస్​ పరీక్షలో ఉమేశ్​ నెగ్గడం వల్ల ఇంగ్లాండ్​తో ఆడనున్న టెస్టు జట్టులోకి అతడిని చేర్చారు.

Speedster Umesh Yadav passes fitness test, added for last 2 Tests vs Eng
ఫిట్​నెస్​ టెస్ట్​ పాస్​.. గులాబి టెస్టుకు ఉమేశ్​

ఇంగ్లాండ్‌తో చివరి రెండు టెస్టుల్లో తలపడే భారత జట్టులో ఫాస్ట్‌బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను చేర్చారు. ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌ టెస్టు సందర్భంగా గాయపడిన ఉమేశ్‌కు సోమవారం ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించారు. అందులో అతడు నెగ్గాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

విజయ్‌ హజారే ట్రోఫీలో పాల్గొనేందుకు వీలుగా శార్దూల్‌ ఠాకూర్‌ను జట్టు నుంచి విడుదల చేసినట్లు చెప్పింది. ఠాకూర్‌ ముంబయికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. మూడో టెస్టులో భారత్‌ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశమున్న నేపథ్యంలో ఉమేశ్‌ ఆ మ్యాచ్‌లో ఆడే అవకాశముంది.

ఇదీ చూడండి: ఆ రికార్డుకు సమయం పడుతుంది!: ఇషాంత్​

Last Updated : Feb 23, 2021, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.