ETV Bharat / sports

'ఇంగ్లాండ్​ తుదిజట్టులో మార్పులు ఉండొచ్చు'​

author img

By

Published : Mar 3, 2021, 5:20 AM IST

టీమ్ఇండియాతో జరిగిన పింక్​ టెస్టులో సీమర్ల ఎంపిక కలిసి రాకపోవడం వల్ల.. నాలుగో టెస్టులో తగిన మార్పులు చేసే అవకాశం ఉందని ఇంగ్లాండ్ మాజీ కోచ్​ మార్క్​ రాబిన్​సన్​ అన్నాడు. నాలుగో టెస్టులో తమ జట్టుకు ఆస్ట్రేలియా మద్దతు ఇవ్వడం సహా ఇంగ్లాండ్ జట్టులోని రొటేషన్​ విధానం గురించి ఈటీవీ భారత్​ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

EXCLUSIVE INTERVIEW: India outplayed us, admits England's former coach Robinson
'ఇంగ్లాండ్​ తుదిజట్టులో మార్పులు ఉండొచ్చు'​

అహ్మదాబాద్​ వేదికగా టీమ్ఇండియాతో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లో ముగియడంపై ఇంగ్లాండ్​ మాజీలు పిచ్​పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మొతేరా పిచ్​పై ఇంగ్లాండ్​ మాజీ కోచ్​ మార్క్​ రాబిన్​సన్​ స్పందించాడు. ఏ సిరీస్​ అయినా ఆతిథ్య జట్టుకే ఎక్కువ ప్రయోజనమని అన్నాడు. దీంతో టీమ్ఇండియాకు అనేక విధాలుగా అది కలిసొచ్చిందని తెలిపాడు. ఇంగ్లాండ్​ జట్టులోని రొటేషన్​ విధానంపై వస్తున్న విమర్శలపై రాబిన్​సన్ మాట్లాడాడు. ఆ విశేషాలు మీకోసం..

ఇంగ్లాండ్ మాజీ కోచ్​ రాబిన్​సన్​తో ఈటీవీ భారత్​ ప్రత్యేక ఇంటర్వ్యూ

నాలుగో టెస్టులో గెలిచేందుకు ఇంగ్లాండ్​కు ఆస్ట్రేలియా మద్దతు ఇవ్వడంపై మీరేమంటారు?

సిరీస్​లోని ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్​ జట్టు టీమ్ఇండియాను ఓడిస్తే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ చేరుకునేందుకు ఆస్ట్రేలియాకు అవకాశం వస్తుంది. కానీ, నా ఉద్దేశం ప్రకారం వారు నిజంగా ఇంగ్లాండ్​కు మద్దతు ఇస్తారు అని నేను అనుకోను.

చివరిటెస్టులో ఇంగ్లాండ్​ తుది జట్టు గురించి?

ఈ పరిస్థితిలో తుది జట్టును ఊహించడం చాలా కష్టం. మూడో టెస్టులో సీమర్లకు అవకాశం ఇచ్చారు. పేసర్లదే పైచేయి అనుకున్నాం. కానీ, ఎవ్వరూ ఊహించనట్టుగా స్పిన్నర్లకు కలిసొచ్చింది. కాబట్టి నాలుగో టెస్టుకు జట్టును ఎంపిక చేసే ముందు పిచ్​ గురించి ఆలోచిస్తారు. పిచ్​ను దృష్టిలో ఉంచుకుని ఫామ్​లో ఉన్న ఆటగాళ్లను ఎంచుకుంటారని ఆశిస్తున్నా.

ఇంగ్లాండ్​ జట్టు పునరాగమనంపై మీ సమాధానం?

సిరీస్​లో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు తిరిగి పట్టుసాధించడం అంత సులువుకాదు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాలి. టీమ్ఇండియాపై ఒత్తిడి తీసుకురావాలి. కానీ, గత రెండు మ్యాచ్​ల్లో మా జట్టు అలా చేయలేకపోయింది. బ్యాటింగ్​లో అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. ప్రత్యర్థులకు సరైన లక్ష్యాన్ని నిర్దేశించాల్సిన అవసరం ఉంది.

న్యూట్రల్​ పిచ్​ క్యూరేటర్​పై మీరేమంటారు?

బహుశా మేము తటస్థ పిచ్​ క్యూరేటర్​ను కలిగి ఉండొచ్చు. లేదా మొతేరా టెస్టు లాంటి ఘటన జరిగి ఉండేది కాదు.

ఇంగ్లాండ్​ జట్టులో రొటేషన్​ విధానంపై..?

ఇంగ్లాండ్​ జట్టులో రొటేషన్ విధానం గురించి పూర్తిగా తెలియకుండా దాన్ని విమర్శించలేం. కానీ, నా అనుభవం ప్రకారం ప్రతి సిరీస్​ ముందు ప్రణాళికలు రూపొందిస్తారు. అవి సరిగ్గా అమలు చేయొచ్చు లేదా చేయకపోవచ్చు. కానీ, జానీ బెయిర్​స్టో విషయంలో మాత్రం నేను నిజంగా బాధపడుతున్నా.

ఇదీ చూడండి: కోహ్లీసేన భయపడాల్సిన పనిలేదు: అక్తర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.