ETV Bharat / sports

వైరల్​: 'మాస్టర్​' పాటకు స్టెప్పులేసిన భారత క్రికెటర్లు​

author img

By

Published : Feb 20, 2021, 10:22 AM IST

టీమ్ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​.. తనకు అమితంగా ఇష్టమైన 'మాస్టర్​' సినిమాలోని 'వాతి కమింగ్​' పాటకు స్టెప్పులేశాడు. దానికి సంబంధించిన వీడియోను అశ్విన్ సోషల్​మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో అశ్విన్​తో పాటు ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా, కుల్దీప్​ యాదవ్​ కూడా డాన్స్​ చేశారు.

Ashwin, Hardik and Kuldeep pull off Vaathi Coming hook step from Master
వైరల్​: 'మాస్టర్​' పాటకు స్టెప్పులేసిన భారత క్రికెటర్లు​

టీమ్ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా, స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్​తో కలిసి 'మాస్టర్​' సినిమాలోని 'వాతి కమింగ్​' అనే పాటకు అశ్విన్ స్టెప్పులేశాడు. ఆ వీడియోను అశ్విన్​ సోషల్ ​మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. గంటలో 2 లక్షలకు పైగా వీక్షణలను దక్కించుకుంది ఆ వీడియో. ఇందులో తొలుత అశ్విన్​ డాన్స్​ స్టార్ట్​ చేయగా.. అతడిని అనుసరిస్తూ.. హార్దిక్​, కుల్దీప్​ కాలు కదిపారు.

చెపాక్​ టెస్టులోనూ..

ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్టులో ఫీల్టింగ్​ చేస్తున్న సమయంలోనూ అశ్విన్​ ఇదే విధంగా స్టెప్పులు వేశాడు. ఆ వీడియో వైరల్​గా మారింది. దీంతో అభిమానులను ఉత్సాహపరిచేందుకు అశ్విన్​ మరోసారి అదే పాటకు డాన్స్​ చేసి వీడియోను సోషల్​మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియోకు అశ్విన్​ భార్య ప్రీతితో పాటు టీమ్​ఇండియా ఫీల్టింగ్​ కోచ్​ ఆర్​.శ్రీధర్​, స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ సహా పలువురు అభిమానులు కామెంట్లు చేశారు.

ఇదీ చూడండి: జాతీయ జట్టును కాదని ఐపీఎల్​లో ఆడేందుకు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.