ETV Bharat / sports

టీ20 సిరీస్​కు ప్రేక్షకుల అనుమతి.. కానీ!

author img

By

Published : Mar 12, 2021, 3:18 PM IST

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 సిరీస్​కు.. 50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించనున్నట్లు గుజరాత్​ క్రికెట్​ అసోసియేషన్​(జీసీఏ) ప్రకటించింది. మ్యాచ్​లను వీక్షించడానికి వచ్చే ప్రతి ఒక్కరూ కొవిడ్​ నిబంధనలను పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ఈ సిరీస్​కు సంబంధించిన 50 శాతం టికెట్లు ఇప్పటికే విక్రయించినట్లు జీసీఏ అధికారులు వెల్లడించారు.

50 per cent seating capacity to be used for T20Is at Narendra Modi Stadium
టీ20 సిరీస్​కు ప్రేక్షకుల అనుమతి.. కానీ!

ఇంగ్లాండ్​తో జరగనున్న టీ20 సిరీస్​కు 50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించింది గుజరాత్​ క్రికెట్​ అసోసియేషన్​ (జీసీఏ). స్టేడియానికి వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది.

"నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 సిరీస్​ కోసం 50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించాం. కొవిడ్​ నిబంధనలను ప్రేక్షకులు విధిగా పాటించే విధంగా చర్యలు తీసుకుంటాం. టీ20 సిరీస్​ టికెట్లను ఆఫ్​లైన్​, ఆన్​లైన్​ ద్వారా విక్రయిస్తున్నాం. ఇప్పటికే 50 శాతం టికెట్లు అమ్ముడయ్యాయి".

- ధన్​రాజ్​ నథ్​వానీ, జీసీఏ వైస్​ ప్రెసిడెంట్​

టీ20 సిరీస్​ను ప్రేక్షకులు వీక్షించేదుకు రానున్న నేపథ్యంలో సీట్లను శానిటైజ్​ చేయనున్నట్లు గుజరాత్​ క్రికెట్​ అసోసియేషన్​ తెలిపింది. కొవిడ్​ నిబంధనలను కచ్చితంగా పాటించే విధంగా ఓ స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ కమిటీలను నియమిస్తామని వెల్లడించింది.

ఇదీ చూడండి: తొలి టీ20లోనే సూర్య అరంగేట్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.