ETV Bharat / sports

END Vs AUS: సెంచరీతో ఉస్మాన్​ విజృంభణ​​.. ఇంగ్లాండ్​ 13/0

author img

By

Published : Jan 6, 2022, 1:16 PM IST

Updated : Jan 6, 2022, 1:55 PM IST

ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్​ 403 పరుగులు వెనుకంజలో ఉంది. క్రీజులో జాక్​ క్రాలే(2), హసీబ్​ హమీద్​(2) ఉన్నారు. అంతకుముందు ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 416 పరుగులు​ వద్ద డిక్లేర్​ చేసింది. ఉస్మాన్​ ఖాజా(137) సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ENG Vs AUS
ENG Vs AUS

యాషెస్​ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట పూర్తయింది. ఆ సమయానికి ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో వికెట్​ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో జాక్​ క్రాలే(2), హసీబ్​ హమీద్​(2) ఉన్నారు.

అంతకుముందు ఓవర్​నైట్​ స్కోరు 126/3తో రెండు రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియాకు ఖాజా(137) సెంచరీ చేయడం వల్ల మరో 290 పరుగులు చేసి 416 రన్స్​ వద్ద డిక్లేర్​ చేసింది. మిగతా బ్యాటర్లు పర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో బ్రాడ్​ ఐదు వికెట్ల ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. జేమ్స్​ అండర్సన్​, మార్క్​ వుడ్​, రూట్​ తలో వికెట్​ తీశారు.

ఇదీ చూడండి: ICC Women world cup 2022: భారత జట్టు ఇదే.. పాక్​తో తొలి పోరు

Last Updated : Jan 6, 2022, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.