ETV Bharat / sports

ECB Cricket: 'తొలగించిన ఉద్యోగులకు భారీ నజరానా'

author img

By

Published : Aug 24, 2021, 4:46 PM IST

గతేడాది కరోనా కారణంగా ఉద్యోగులను తొలగించిన ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు.. వారికి బోనస్​ను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు 2022నాటికి వీరికి ఈ మొత్తాన్ని అందించనున్నట్లు గార్డియన్ పత్రిక కథనం పేర్కొంది.

ECB-BONUS
ECB-BONUS

కొవిడ్ కారణంగా వాటిల్లిన ఆర్థిక నష్టం కారణంగా గతేడాది 62 ఉన్నతస్థాయి ఉద్యోగులను తొలగించింది ఇంగ్లాండ్-వేల్స్ క్రికెట్ బోర్డ్(ECB). అయితే ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడిన దృష్ట్యా వారికి 2.1 మిలియన్ పౌండ్ల బోనస్‌ను అందివ్వనున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక ప్రోత్సాహక ప్రణాళిక(LTIP)లో భాగంగా.. 2022నాటికి వారంతా ఈ మొత్తాన్ని అందుకోనున్నట్లు గార్డియన్ పత్రిక తెలిపింది.

"కొవిడ్-19 మహమ్మారి సమయంలో మంచి పనితీరు కనబర్చిన ఎగ్జిక్యూటివ్‌లకు రివార్డ్ అందిస్తున్నాం. స్పోర్ట్స్ ఫెడరేషన్‌ సహా.. పలు విభాగాల్లో దీర్ఘకాలిక ప్రోత్సాహక ప్రణాళికలు అమలు అవుతున్నాయి. ఎగ్జిక్యూటివ్‌ల దీర్ఘకాల ఉత్తమ పనితీరుకు ఇదొక గుర్తింపు."

-ఇయాన్ వాట్మోర్, ఈసీబీ ఛైర్మన్

మ్యాచ్​ ఫీజులో కోత..

గతేడాది కరోనా వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది ఈసీబీ. ఇక 2020-21లో ఈసీబీ 16.5 మిలియన్ పౌండ్ల నష్టాన్ని చవిచూసిందని.. 2016లో 73 మిలియన్ పౌండ్లున్న నిల్వలు ఏకంగా రెండు మిలియన్ పౌండ్లకు పడిపోయినట్లు గార్డియన్‌ నివేదించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.