ETV Bharat / sports

'దేవ్​దత్ పడిక్కల్​కు ఇంకా టైముంది'

author img

By

Published : May 9, 2021, 5:49 PM IST

జాతీయ జట్టు(టెస్టు ఫార్మాట్​)లోకి యువ బ్యాట్స్​మన్ దేవదత్​ పడిక్కల్​ను తీసుకునేందుకు మరో ఏడాది పట్టొచ్చని మాజీ చీఫ్​ సెలక్టర్​ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు​. అతడికి మంచి భవిష్యత్ ఉందని చెప్పాడు. ఫామ్​లో ఉన్న అతడిని ప్రపంచటెస్టు ఛాంపియన్​షిఫ్​ ఫైనల్​, ఇంగ్లాండ్​తో సిరీస్​ కోసం ఎందుకు తీసుకోలేదంటూ అభిమానులు అడుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు ఎమ్మెస్కే.

devadutt
దేవదత్​

ఆర్సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్.. గత రెండు ఐపీఎల్ సీజన్లలోనూ బాగా ఆడి ఎమర్జింగ్ ప్లేయర్​గా నిలిచాడు. చక్కని బ్యాటింగ్​తో ఆకట్టుకుని, సెలక్టర్ల దృష్టిలోనూ పడ్డాడు. ఈ ఏడాది విజయ్​ హజారే ట్రోఫీలోనూ ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్​మన్​గా నిలిచి, జాతీయ జట్టులో చోటు కోసం ఎంతగానో శ్రమిస్తున్నాడు. కానీ అతడికి.. ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​, ఇంగ్లాండ్​తో టెస్టు​ సిరీస్​ కోసం ఇటీవల ప్రకటించిన జంబో జట్టులోనూ చోటు దక్కలేదు. దీంతో ఫామ్​లో ఉన్న అతడిని ఎందుకు తీసుకోలేదంటూ అభిమానులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీనిపై స్పందించిన మాజీ చీఫ్​ సెలక్టర్​ ఎమ్మెస్కే ప్రసాద్​.. అతడిని జట్టులోకి తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని అన్నాడు.

"దేవదత్​ను టెస్టు ఫార్మాట్​లోకి తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అతడు జట్టులోకి వచ్చే ముందు మరింత బలంగా తయారవ్వాలి. ఇందుకోసం మరో ఏడాది పాటు దేశవాళీ క్రికెట్​ ఆడాల్సిన అవసరం ఉంది. అతడికి మంచి భవిష్యత్​ ఉంది. తప్పకుండా జట్టులోకి వస్తాడు" అని ప్రసాద్ చెప్పాడు. ప్రసిద్ధ్​ కృష్ణ, అవేశ్​ఖాన్​ ఎంపికవ్వడం గురించి మాట్లాడుతూ.. "భారత్​ ఏ జట్టులో ప్రసిద్ధ్​ కృష్ణ మంచి బౌలర్​. బాగా ఆడుతున్నాడు. అవేశ్​ కూడా ఐపీఎల్​లో 145-147కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. కాబట్టి ఇంగ్లాండ్​లో టీమ్​ఇండియాతో ప్రాక్టీస్​ చేయడానికి వీరి బౌలింగ్​ బాగా ఉపయోగపడుతుంది. మొత్తంగా వీరు భవిష్యత్​లో జట్టుకు ఆడతారు" అని చెప్పాడు.

అయితే ప్రకటించిన జట్టులో హార్దిక్​ పాండ్య, భువీ, కుల్దీప్​, పృథ్వీ షా లాంటి ఆటగాళ్ల పేర్లు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇదీ చూడండి: డబ్ల్యూటీసీ ఫైనల్​ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.