ETV Bharat / sports

నా నెక్ట్స్​ టార్గెట్ అదే- కెరీర్​ ప్లాన్​పై వార్నర్ హింట్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 4:31 PM IST

Updated : Jan 7, 2024, 5:54 PM IST

David Warner Coach: టెస్టు, వన్డేలకు గుడ్​బై చెప్పిన వార్నర్ ప్రస్తుతం టీ20ల్లో కొనసాగనున్నాడు. అయితే క్రికెట్​ నుంచి పూర్తిగా దూరమయ్యాక కోచ్​గా వ్యవహరించాలని ఉంన్నట్లు తెలిపాడు.

David Warner Coach
David Warner Coach

David Warner Coach: ఇంటర్నేషనల్ వన్డే, టెస్టు ఫార్మట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం టీ20ల్లో కొనసాగనున్నాడు. అయితే పొట్టి ఫార్మాట్​కు కూడా వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ నుంచి దూరం అవ్వాలని లేదట. అందుకే భవిష్యత్​లో అవకాశం వస్తే కోచ్​గా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆసక్తి చూపిస్తాడట. 'నేను కోచ్​గా సమర్థంగా రాణించగలను. నా ఫ్యూచర్ గోల్​ కూడా అదే. ఈ విషయం గురించి నా భార్యకు కూడా చెప్పాను. కోచ్​గా బాధ్యతలు స్వీకరిస్తే ఏడాదిలో కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పా' అని వార్నర్ అన్నాడు.

రెండు ఛాప్టర్లు ముగిశాయి: కెరీర్​లో చివరి టెస్టు మ్యాచ్​ ఆడేసిన వార్నర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. 'నా కెరీర్​లో రెండు ఛాప్టర్లు (వన్డే, టెస్టు) ముగిశాయి. ఇంకో అధ్యాయం (టీ20 ఫార్మాట్) మిగిలి ఉంది. ఇన్నేళ్ల కెరీర్​లో ఎవరికీ ఇబ్బంది కలిగించలేదని అనుకుంటున్నా. ఇప్పటివరకు నా కెరీర్​లో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు' అని వార్నర్ తెలిపాడు.

David Warner Test Career: శనివారం (జనవరి 6) పాకిస్థాన్​తో ఆఖరి టెస్టు మ్యాచ్​ ఆడిన వార్నర్​కు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్​లో ఘనమైన ఫేర్​వెల్ దక్కింది. మ్యాచ్ అనంతరం వార్నర్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. అయితే 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్నర్ దాదాపు 14 ఏళ్లపాటు ఆసీస్ జాతీయ జట్టుకు సేవలందించాడు. రెడ్​బాల్ ఫార్మాట్​లో వార్నర్ తన కెరీర్​లో 112 మ్యాచ్​లు ఆడాడు. మొత్తం 205 ఇన్నింగ్స్​లో 44.60 సగటుతో 8786 పరుగులు చేశాడు. కాగా, అందులో 26 సెంచరీలు (3సార్లు 200+ స్కోర్), 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

David Warner ODI Career: 2023 వరల్డ్​కప్​లో కెరీర్​లో ఆఖరి మ్యాచ్​ ఆడిన వార్నర్, ఇటీవల వన్డేలకు కూడా గుడ్​బై చెప్పాడు. 2009లో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్​తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. సుదీర్ఘంగా 14 ఏళ్లపాటు ఆసీస్​ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ జట్టుకు అనేక విజయాలు కట్టబెట్టాడు. తన కెరీర్​లో ఇప్పటివరకు 161 వన్డే మ్యాచ్​లు ఆడాడు. 45.01 సగటుతో 6932 పరుగులు నమోదు చాశాడు. అందులో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టుకు తన అవసరం ఉంటే కచ్చితంగా మళ్లీ ఆడతానని స్పష్టం చేశాడు.

14ఏళ్ల టెస్టు కెరీర్​- అంచనాలకు మించి ఇన్నింగ్స్​- బెస్ట్​ 5 ఇవే!

వన్డేలకు 'వార్నర్' గుడ్​బై- అవసరమైతే ఆ టోర్నీలో ఆడతాడట!

Last Updated : Jan 7, 2024, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.