ETV Bharat / sports

CWC Qualifiers : ప్రపంచకప్​నకు నెదర్లాండ్స్‌.. స్కాట్లాండ్​ను చిత్తు చేసి..

author img

By

Published : Jul 6, 2023, 9:29 PM IST

Updated : Jul 6, 2023, 10:47 PM IST

CWC Qualifiers Super Six : భారత్​ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్​కు నెదర్లాండ్స్​ జట్టు అర్హత సాధించింది. గురువారం జరిగిన ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ సూపర్‌ సిక్స్‌ పోరులో నెదర్లాండ్స్‌ స్కాట్లాండ్‌ను చిత్తుచేసి ఫైనల్​ బెర్తును ఖరారు చేసుకుంది.

ODI World Cup 2023 ODI World Cup 2023
ప్రపంచకప్​ పోరు రేసులో నెదర్లాండ్స్‌.. 4 వికెట్ల తేడాతో స్కాట్​లాండ్​ను ఇంటికి..

CWC Qualifiers Super Six : భారత్​ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్​కు నెదర్లాండ్స్​ జట్టు అర్హత సాధించింది. గురువారం జరిగిన ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 4 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను చిత్తుచేసి ఫైనల్​ బెర్తును ఖరారు చేసుకుంది. దీంతో క్వాలిఫయర్‌-2 హోదాలో నెదర్లాండ్స్‌ వరల్డ్‌కప్‌కు పదో జట్టుగా అర్హత పొందింది. నెదర్లాండ్స్‌ ఆటగాడు బాస్ డి లీడే ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Netherlands vs Scotland : మొదట స్కాట్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (106; 110 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్‌ రిచీ బెరింగ్టన్ (64) అర్ధ శతకంతో మెరిశాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో బాస్ డి లీడే (5/52) ఆకట్టుకున్నాడు. ర్యాన్ క్లైన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

మెరుగైన రన్‌రేట్‌తో ముందుకు..
Super Six Points Table : బౌలింగ్‌లో అదరగొట్టిన బాస్ డి లీడే బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 123 పరుగులు చేశాడు. దీంతో 278 పరుగుల భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్స్‌ 42.5 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. క్వాలిఫయర్స్‌ సూపర్‌ సిక్స్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన శ్రీలంక జట్టు ఇప్పటికే ప్రపంచ కప్‌ రేసుకు దూసుకెళ్లింది. ఇక స్కాట్లాండ్‌పై తాజా విజయంతో చివరి బెర్తును నెదర్లాండ్స్‌ సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో స్కాట్లాండ్‌, జింబాబ్వే, నెదర్లాండ్స్‌తో 6 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే స్కాట్లాండ్‌పై భారీ విజయం సాధించిన నెదర్లాండ్స్‌.. మెరుగైన రన్‌రేట్‌ను దక్కించుకుని ప్రపంచ కప్‌కు అర్హత పొందింది.

మ్యాచ్​ షెడ్యూలిదే..
ICC World Cup 2023 Schedule : అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ భారత్​ వేదికగా జరగనుంది. మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ పోరుకు సంబంధించిన మొదటి మ్యాచ్​ ఇంగ్లాండ్​-న్యూజిలాండ్​ మధ్య అహ్మదాబాద్​లో జరగనుంది. ఈ మ్యాచ్​తోనే ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది.​ అయితే భారత్​ తన తొలి మ్యాచ్​ ఆస్ట్రేలియాతో అక్టోబర్​ 8న తలపడనుంది. ఇక అందరికి ఆసక్తిని రేకెత్తించే దాయాదుల పోరు (పాకిస్థాన్​- ఇండియా మ్యాచ్​) అక్టోబర్​ 15న అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది.

ICC World Cup 2023 Schedule
ఐసీసీ ప్రపంచ కప్​-2023 మ్యాచ్ షెడ్యూల్​
Last Updated : Jul 6, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.