ETV Bharat / sports

శ్రీశాంత్​ స్లెడ్జింగ్​.. జైస్వాల్​ వరుస సిక్సర్లు

author img

By

Published : Jan 15, 2021, 5:30 AM IST

సయ్యద్​ ముస్తాక్ అలీ టోర్నీలో యశస్వి జైస్వాల్​పై స్లెడ్జింగ్​ చేశాడు కేరళ పేసర్​ శ్రీశాంత్​. ఇందుకు సిక్సర్లతో సమాధానమిచ్చాడు యశస్వి. ఈ మ్యాచ్​లో కేరళ జట్టు విజయం సాధించింది.

sree
శ్రీశాంత్

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్న భారత పేసర్​ శ్రీశాంత్.. స్లెడ్జింగ్ చేశాడు. అయితే అది​ తన మీదకే రివర్స్ అయింది. ముంబయి యువ బ్యాట్స్​మన్​ యశస్వి జైస్వాల్​ సిక్సర్ల రూపంలో శ్రీశాంత్​కు గట్టి సమాధానమిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తోంది.

అసలేం జరిగిందంటే?

కేరళ, ముంబయి జట్ల మధ్య బుధవారం హోరాహోరీగా మ్యాచ్​ జరిగింది. ఈ మ్యాచు తొలి ఇన్నింగ్స్​లో ఆరో ఓవర్లో స్లెడ్జింగ్​ ఘటన జరిగింది. శ్రీశాంత్​ తన మూడో ఓవర్​లో వేసిన బంతిని జైస్వాల్​ అద్భుతంగా బాదాడు. దీంతో జైస్వాల్​ వైపు గుర్రుగా చూస్తూ స్లెడ్జింగ్​ చేశాడు శ్రీశాంత్. అందుకు బదులుగా... ఆ తర్వాత శ్రీశాంత్ వేసిన మూడు బంతులన్ని వరుసగా బౌండరీలకు తరలించాడు. వీటిలో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ ఉంది. ఈ మ్యాచ్​లో కేరళ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇదీ చూడండి: ఏడేళ్ల తర్వాత తొలి వికెట్​.. శ్రీశాంత్​ భావోద్వేగం​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.