ETV Bharat / sports

సుందర్ కుక్కపిల్లకు క్రికెట్ స్టేడియం పేరు

author img

By

Published : Apr 4, 2021, 8:05 PM IST

Updated : Apr 4, 2021, 8:38 PM IST

Washington Sundar names pet dog 'Gabba'
సుందర్ కుక్కపిల్లకు క్రికెట్ స్టేడియం పేరు

తాను టెస్టు అరంగేట్రం చేసిన గబ్బా మైదానం పేరు, తన కుక్క పిల్లకు పెట్టినట్లు యువ క్రికెటర్ సుందర్ వెల్లడించాడు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

టీమ్​ఇండియా క్రికెటర్​ వాషింగ్టన్ సుందర్.. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​లో తన వంతు పాత్ర పోషించాడు. గబ్బా మైదానంలో తొలి మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. అందుకు గుర్తుగా తన కుక్క పిల్లకు 'గబ్బా' అని పేరు పెట్టాడు. ఈ విషయాన్ని ఇన్​స్టా వేదికగా పంచకున్నాడు.

గత 32 ఏళ్లలో ఆసీస్​పై గెలిచిన జట్టు భారత్​ మాత్రమే. ఆ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 62 పరుగులు సహా నాలుగు వికెట్లు తీశాడు సుందర్. రెండో ఇన్నింగ్స్​లో పంత్​తో కలిసి కీలక ఇన్నింగ్స్​(22 బంతుల్లో 29 పరుగుల) ఆడాడు. ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. అనంతరం సిరీస్​ను 2-1తేడాతో సొంతం చేసుకుంది.

Last Updated :Apr 4, 2021, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.