ETV Bharat / sports

ప్రపంచకప్​లో సత్తాచాటిన సోదరులు వీరే!

author img

By

Published : Feb 28, 2021, 9:45 AM IST

Updated : Feb 28, 2021, 12:40 PM IST

Brother-Duos who played together at World Cups
ప్రపంచకప్​ జట్టుకు ఆడిన సోదరులు వీరే!

అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు టీమ్ఇండియా ఆల్​రౌండర్ యూసఫ్ పఠాన్. ఇతడి సోదరుడు ఇర్ఫాన్ పఠాన్​ కూడా జాతీయ జట్టుకు ఆడాడు. వీరిద్దరూ కలిసి 2011 ప్రపంచకప్​లోనూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వీరితో పాటు ఇప్పటివరకు ప్రపంచకప్​నకు ప్రాతనిధ్యం వహించిన సోదరులు ఎవరో చూద్దాం.

అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు టీమ్ఇండియా ఆల్​రౌండర్ యూసఫ్ పఠాన్. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్​తో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పఠాన్.. తర్వాత 2011 ప్రపంచకప్​లో విజేతగా నిలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత భారత జట్టు ఎన్నో విజయాల్లో పాలుపంచుకున్న ఇతడు తన సోదరుడు ఇర్ఫాన్ పఠాన్​తో 2007 టీ20 ప్రపంచకప్​లో కలిసి ఆడాడు. తద్వారా ప్రపంచకప్​ విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి సోదరుల జోడీగా రికార్డులకెక్కారు యూసఫ్-ఇర్ఫాన్. ఇర్ఫాన్ గతేడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, ఇప్పటివరకు వరల్డ్​కప్ జట్టుకు ప్రాతనిధ్యం వహించిన సోదరులు మరికొందరూ ఉన్నారు. వారెవరో చూద్దాం.

స్టీవ్-మార్క్ వా

ప్రపంచ క్రికెట్​లో ఎల్లకాలం గుర్తిండిపోయే సోదరులుగా నిలిచారు ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ వా-మార్క్ వా. వీరిద్దరూ 1992, 96, 99 ప్రపంచకప్​లకు ప్రాతినిధ్యం వహించారు. 1999లో స్టీవ్ వా సారథ్యం వహించిన ఆసీస్ జట్టు విజేతగా నిలిచింది. 398 పరుగులతో ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు స్టీవ్ వా. రాహుల్ ద్రవిడ్ మొదటి స్థానంలో ఉన్నాడు. మార్క్ వా 375 పరుగులతో నాలుగో స్థానం కైవసం చేసుకున్నాడు.

Brother-Duos who played together at World Cups
స్టీవ్-మార్క్ వా

మైఖెల్-డేవిడ్ హస్సీ

జాతీయ జట్టులోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన సోదరులు మైఖెల్ హస్సీ, డేవిడ్ హస్సీ. వీరిద్దరూ ఆస్ట్రేలియా జట్టుకు 2011 ప్రపంచకప్​లో ప్రాతినిధ్యం వహించారు. కానీ ఈ టోర్నీలో ఆస్ట్రేలియా క్వార్టర్ ఫైనల్​లో టీమ్ఇండియా చేతిలో ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. కానీ 2007 ప్రపంచకప్​ విజేతగా నిలిచిన జట్టులో మైఖేల్ హస్సీ సభ్యుడిగా ఉన్నాడు. వీరిద్దరూ 2013లో తమ చివరి మ్యాచ్ ఆడారు.

Brother-Duos who played together at World Cups
మైఖెల్-డేవిడ్ హస్సీ

బ్రెండన్-నాథన్ మెక్​కలమ్

న్యూజిలాండ్​కు చెందిన ఈ సోదరులు 2011, 2015 ప్రపంచకప్​ జట్టులో సభ్యులుగా ఉన్నారు. కానీ 2015 వరల్డ్​కప్​లో నాథన్ మెక్​కలమ్ టోర్నీ మొత్తం బెంచ్​కే పరిమితమయ్యాడు. మొత్తంగా బ్రెండన్ నాలుగు ప్రపంచకప్​లకు ప్రాతనిధ్యం వహించగా, నాథన్ రెండు మెగాటోర్నీల్లో ఆడాడు.

Brother-Duos who played together at World Cups
బ్రెండన్-నాథన్ మెక్​కలమ్

ఉమర్-కమ్రన్ అక్మల్

పాకిస్థాన్​కు చెందిన ఉమర్ అక్మల్, కమ్రన్ అక్మల్ సోదరులు 2011 ప్రపంచకప్​ జట్టులో చోటు సంపాదించారు. ఈ టోర్నీలో సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది పాక్. అప్పటికే కమ్రన్ సీనియర్ ఆటగాడిగా కొనసాగుతుండగా, ఉమర్​ అప్పుడే జట్టులోకి వచ్చాడు. వీరి మరో సోదరుడు అద్నన్ అక్మల్ కూడా 21 వన్డేలు, 5 టెస్టులకు ప్రాతనిధ్యం వహించాడు. కానీ ప్రపంచకప్​ మ్యాచ్ మాత్రం ఆడలేకపోయాడు.

Brother-Duos who played together at World Cups
ఉమర్-కమ్రన్ అక్మల్

రిచర్డ్-డేల్-బెర్రీ హాడ్లీ

ఇంగ్లాండ్​కు చెందిన ఈ ముగ్గురు హడ్లీ సోదరులు 1975లో జరిగిన మొట్టమొదటి 60 ఓవర్ల ప్రపంచకప్​కు ప్రాతనిధ్యం వహించారు. ఈ ముగ్గురు కలిసి కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడారు. ఇందులో రిచర్డ్ హాడ్లీ లెజెండరీ క్రికెటర్​గా ఎదిగాడు. ఈయన కెరీర్​లో 86 టెస్టులు, 115 వన్డేలు ఆడి జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు.

ఇవీ చూడండి: రోడ్​ సేఫ్టీ వరల్డ్ సిరీస్​ 2021: షెడ్యూల్​ ఇదే

Last Updated :Feb 28, 2021, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.