ETV Bharat / sports

అతడో వరల్డ్​ క్లాస్ ప్లేయర్ : కోచ్ రవిశాస్త్రి

author img

By

Published : Sep 26, 2019, 5:37 PM IST

Updated : Oct 2, 2019, 2:52 AM IST

భారత క్రికెటర్ రిషభ్ పంత్

టీమిండియా యువ వికెట్​ కీపర్ రిషబ్​ పంత్​ను వరల్డ్​ క్లాస్​ ప్లేయర్​ అని కొనియాడాడు కోచ్ రవిశాస్త్రి. అయితే ప్రస్తుతం నేర్చుకునే దశలో ఉన్నాడని, ఆటలో కుదురుకునేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పాడు.

కొంతకాలంగా ఫామ్​ లేక ఇబ్బంది పడుతోన్న టీమిండియా యువ బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​ను వెనకేసుకొచ్చాడు ప్రధాన కోచ్ రవిశాస్త్రి. అతడో వరల్డ్​క్లాస్​ ప్లేయర్​ అని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్​లో రిషబ్​కు జట్టు యాజమాన్యం​ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పాడు.

"పంత్​ వరల్డ్​ క్లాస్​ క్రికెటర్. మ్యాచ్​లను గెలిపించగల సామర్థ్యం ఉంది. ఇలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. అతడు ఫామ్​ అందుకునేందుకు కొంత కాలం వేచి చూడక తప్పదు. మీడియా, విశ్లేషకులు.. పంత్​ గురించి వివిధ రకాలుగా రాస్తున్నారు. కానీ అతడికి జట్టులో కావాల్సినంత స్వతంత్రం ఉంది. అతడు నేర్చుకునే దశలో ఉన్నాడు. ఈ విషయంలో మేనేజ్​మెంట్​ పంత్​కు అండగా ఉంటుంది". -రవిశాస్త్రి, టీమిండియా ప్రధాన కోచ్

ఇంతకుముందు పంత్​ విషయంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు కోచ్ రవిశాస్త్రి.

team india coach ravi shastri
టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి

"నేను వేరే విషయం గురించి మాట్లాడాను. అయితే పంత్ విధ్వంసక క్రికెటర్. అతడికి జట్టు నుంచి పూర్తి సహకారం అందిస్తున్నాం" -రవిశాస్త్రి, టీమిండియా ప్రధాన కోచ్

అంతకుముందు టీమిండియా మాజీ ఆల్​రౌండర్ యువరాజ్​ సింగ్.. పంత్​కు మద్దతుగా నిలిచాడు. అతడిపై కామెంట్లు చేయడం మానుకోవాలని, రిషబ్​​కు సహకారమందించాలని చెప్పాడు. అదేవిధంగా ధోనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు పంత్​ సరైనవాడని అన్నాడు.

"మహేంద్ర సింగ్ ధోనీ.. ఒక్క రోజులో ప్రముఖ ఆటగాడిగా మారిపోలేదు. అందుకు కొన్నేళ్ల సమయం పట్టింది. అతడిని భర్తీ చేసేందుకు కొంత కాలం పట్టొచ్చు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్​కు ఇంకా చాలా సమయం ఉంది. ఆలోపు పంత్ సిద్ధమవుతాడని ఆశిస్తున్నా" -యువరాజ్ సింగ్, భారత మాజీ క్రికెటర్

టీ20ల్లో ధోనీ రిటైర్మెంట్​ తర్వాత అతడి స్థానాన్ని పంత్​ భర్తీ చేస్తాడని అందరూ భావించారు. అయితే కొద్ది రోజులుగా ఒకేరీతిలో ఔటవుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడీ యువ ఆటగాడు. వీటన్నింటికీ పంత్​ ఏ విధంగా సమధానమిస్తాడో చూడాలి.

ఇది చదవండి: ఒక్క అవకాశం ఇవ్వమని.. బతిమాలా: మాస్టర్ బ్లాస్టర్ సచిన్​ తెందూల్కర్

RESTRICTIONS: SNTV clients only. No access France. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Fukuoka Hakatanomori Stadium, Fukuoka Prefecture, Fukuoka City, Japan. 26th September, 2019
1. 00:00 SOUNDBITE (English): Dean Budd, Italy captain:
Q: "Canada captain Dean Budd, come across now, Conor O'Shea (Italy head coach) just had a quick word with you, what was it he said to you?"
"Italy! (points to Italy badge on his shirt) But (laughs) he just said it was a hell of an effort and we've earned a few drinks tonight!"
SOURCE: IMG Media
DURATION: 00:16
STORYLINE:
An interviewer at the Rugby World Cup in Japan was left red-faced on Thursday after wrongly describing Dean Budd as the Canada captain in his opening question.
"Italy!" Budd replied, pointing to his bright 'Azzurri' blue shirt.
The Italy skipper took the mistake in good stead through - his side had just thrashed the Canadians 48-7 in Fukuoka City and had gone to the top of the Pool B standngs.
Last Updated :Oct 2, 2019, 2:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.