ETV Bharat / sports

ఈ ఆల్​రౌండర్​ బ్యాట్​ పట్టినా.. గరిటె తిప్పినా సూపరే!

author img

By

Published : Jun 23, 2020, 6:27 AM IST

Team India All Rounder Hardik Pandya turns to Chef
ఈ ఆల్​రౌండర్​ బ్యాట్​ పట్టినా.. గరిట తిప్పినా సూపరే!

మైదానంలో బ్యాట్​ పట్టి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా.. ప్రస్తుతం వంటింట్లో గరిటె పట్టాడు. తన కుటుంబ సభ్యులకు వండిపెట్టడానికి తానే ఛెఫ్​ అవతారమెత్తాడు. తాను వంట చేస్తున్న చిత్రాన్ని తాజాగా ఇన్​స్టాలో పంచుకున్నాడు హార్దిక్​.

లాక్​డౌన్​ విరామ సమయంలో తనకు ఇష్టమైన వ్యాపకాలతో సమయాన్ని సరదాగా గడుపుతున్నాడు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా. తాజాగా వంటింట్లో దూరి గరిటె పట్టి.. కొత్త వంటలు నేర్చుకుంటున్నాడీ స్టార్​ క్రికెటర్​. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఇన్​స్టాలో షేర్​ చేశాడు హార్దిక్​.

"మీ చేతికి కొత్తదనాన్ని నేర్పించే ప్రయత్నంలో ఎప్పుడూ ఆలస్యం చేయవద్దు. పాండ్యా ఇంట్లో వంటింటి పనులను చేస్తున్నా. చీజ్ బటర్​ మసాలా కోసం స్వైప్​ చేయండి" అని ఇన్​స్టాలో రాసుకొచ్చాడీ యువ క్రికెటర్​.

ఇటీవలే తనకు కాబోయే భార్య నటాషా స్టాంకోవిచ్​.. గర్భవతి అనే వార్తను సోషల్​మీడియాలో పంచుకున్నాడు హార్దిక్​. దుబాయ్​లో హార్దిక్​.. నటాషాకు తన ప్రేమను వ్యక్త పరచగా, 2020 నూతన సంవత్సర వేడుకలో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది.

ఇదీ చూడండి... 'కోహ్లీ, స్మిత్​ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్​మెన్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.