ETV Bharat / sports

సన్నీలియోనీతో స్టార్​ క్రికెటర్​ ఫన్నీ డ్యాన్స్​

author img

By

Published : May 1, 2020, 12:17 PM IST

Sunny Leone dances lusciously To Dwayne Bravo's hit number 'Champion'
స్టార్​ క్రికెటర్​తో కలిసి సన్నీలియోనీ ఫన్నీ డ్యాన్స్​

బాలీవుడ్​ హాట్ బ్యూటీ సన్నీ లియోనీతో ఇన్​స్టా లైవ్​​లో పాల్గొన్న ఆల్​రౌండర్​ బ్రావో.. తను రూపొందించిన పాటకు డ్యాన్స్​ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

వెస్టిండీస్​ స్టార్​ ఆల్​రౌండర్​ డ్వేన్​ బ్రావో సంగీతాభిరుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో తన ఆటతో పాటు సందర్భానుసారంగా పాటలు రూపొందించి, అభిమానులను అలరిస్తుంటాడు. లాక్​డౌన్​ వేళ ఇంటికే పరిమితమైన ఈ ఆల్​రౌండర్​... నటి​ సన్నీ లియోనీతో ఇన్​స్టా వేదికగా లైవ్​ సెషన్​లో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా వీరిద్దరూ బ్రావో రూపొందించిన 'ఛాంపియన్​' పాటకు స్టెప్పులేస్తూ కనిపించారు. దీనితో పాటే చాలా విషయాల గురించి సరదాగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

కరోనా కట్టడి కోసం ప్రజల్లో అవగాహన పెంచేందుకు సోషల్ మీడియా వేదికగా పలు జాగ్రత్తలు చెబుతున్నాడు బ్రావో. ఇటీవలే టీమిండియా మాజీ సారథి ధోనీపై ప్రశంసల జల్లు కురింపించిన ఇతడు.. మహీపై ఓ పాటను కంపోజ్​ చేస్తున్నట్లు తెలిపాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.