ETV Bharat / sports

కరోనా దెబ్బతో రద్దయిన ఇంగ్లాండ్-సౌతాఫ్రికా వన్డే

author img

By

Published : Dec 6, 2020, 3:25 PM IST

దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య ఆదివారం జరగాల్సిన తొలి వన్డేకు ఆటంకం ఎదురైంది. ఇంగ్లాండ్​ ఆటగాళ్లు ఉండే హోటల్​ సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల మ్యాచ్​ను ఆపేశారని ఐసీసీ ట్వీట్​ చేశారు.

South Africa vs England: 1st ODI Suspended After Hotel Staff Test Covid Positive
మరోసారి నిలిచిపోయిన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్​ తొలి వన్డే

దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్​ మధ్య నేడు (ఆదివారం) జరగాల్సిన తొలి వన్డే అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆటగాళ్లు ఉంటున్న హోటల్​ సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకడం వల్ల మ్యాచ్​ ప్రారంభం కాకుండానే నిలిపేశారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్​ నియంత్రణ మండలి (ఐసీసీ) ట్విట్టర్​లో వెల్లడించింది. తొలుత మ్యాచ్​ నిర్వహించడానికి ముందు కొంత ఆలస్యం చేసినా.. ఆ తర్వాత మ్యాచ్​ను ఆపేయాలని ఐసీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

"దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్​ మధ్య జరగనున్న తొలి వన్డే నిలిపివేయడం జరిగింది. ఇంగ్లాండ్​ ఆటగాళ్లు ఉంటున్న హోటల్​లోని సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు" అని ఐసీసీ ట్వీట్​ చేసింది.

షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారమే ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. కానీ ఆతిథ్య జట్టులో ఓ ఆటగాడికి వైరస్‌ సోకినట్లు తేలడం వల్ల మ్యాచ్‌ను ఆదివారానికి వాయిదా వేశారు. దీంతో ఇప్పుడు వరుసగా రెండు రోజుల్లో (ఆది, సోమవారాల్లో) మ్యాచ్​లు నిర్వహించాలని యోచించినా.. హోటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల మ్యాచ్​ను పూర్తిగా నిలిపేశారు. దక్షిణాఫ్రికాలో ఇంగ్లాండ్‌ పర్యటన మొదలైనప్పటి నుంచి ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.

ఇదీ చూడండి: సఫారీ క్రికెటర్​కు కరోనా.. తొలి వన్డే వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.