ETV Bharat / sports

యాషెస్​: ఆసీస్​కు షాక్​... మూడో టెస్టుకు స్మిత్​ దూరం

author img

By

Published : Aug 21, 2019, 5:51 AM IST

Updated : Sep 27, 2019, 5:47 PM IST

ప్రతిష్ఠాత్మక యాషెస్​​లో ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్​ బ్యాట్స్​మెన్​ స్టీవ్​ స్మిత్ గాయం కారణంగా​ మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆసీస్​ క్రికెట్​ బోర్డు మంగళవారం ప్రకటించింది.

యాషెస్​లో ఆసీస్​కు పెద్ద దెబ్బ... మూడో టెస్టుకు స్మిత్​ దూరం

యాషెస్‌లో భాగంగా ఇం‍గ్లాండ్‌తో మూడో పోరుకు సిద్ధమవుతోన్న ఆసీస్​ జట్టుకు షాక్​ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైనట్లు... క్రికెట్​ ఆస్ట్రేలియా వెల్లడించింది.

" హెడింగ్లే వేదికగా జరగనున్న యాషెస్​ మూడో టెస్టుకు స్టీవ్​ స్మిత్​ దూరమయ్యాడు. గాయం వల్ల మంగళవారం జరిగిన ట్రైనింగ్​ సెషన్​లోనూ అతడు​ పాల్గొనలేకపోయాడు. కోచ్​ జస్టిన్​ లాంగర్​ సూచన మేరకు స్మిత్​కు మరింత విశ్రాంతినివ్వాలని భావిస్తున్నాం".
-- క్రికెట్​ ఆస్ట్రేలియా ట్వీట్​

మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్​ల్లోనూ రెండు శతకాలు చేశాడీ స్మిత్​​. రెండో టెస్టులో 92 పరుగులతో రాణించాడు. స్మిత్‌ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లబషేన్‌ మూడో టెస్టులోనూ బరిలోకి దిగనున్నాడు. ఇరుజట్ల మధ్య మ్యాచ్​ గురువారం నుంచి ప్రారంభం కానుంది.

లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో... ఇంగ్లాండ్‌ పేసర్​ జోఫ్రా ఆర్చర్‌ రాకాసి బంతికి స్మిత్‌ గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు దిగలేదు. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్‌ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన స్మిత్‌.. తర్వాతి టెస్టుకు ఆడకపోవడం ఆ జట్టుపై బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

  • Steve Smith and Jofra Archer engage in one of the truly great Ashes battles
    It's easy to get used to the idea of cricket as genteel. Especially in English grounds, with the hats and the cakes and the crust-off sandwiches, the way a Test match can burble along until it becomes pic.twitter.com/MwURFZQD6S

    — Ashwin Parwana (@AshwinParwana) August 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి... తల్లులు కాబోతున్న మహిళా క్రికెట్ జంట

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
TUESDAY 20 AUGUST
1300
PRAGUE_ Taylor Kitsch, Nina Hoss, chat from the set of new series 'Shadowplay.'
2100
NEW YORK_ 'Power' cast says fans won't have to worry about a disappointing final season like some complained about Game of Thrones.
NEW YORK_ Jillian Bell breaks out in 'Brittany Runs a Marathon.'
COMING UP ON CELEBRITY EXTRA
NEW YORK_ 'Beverly Hills, 90210' stars Tori Spelling, Jennie Garth and Brian Austin Green discuss the levels of fame the show provided them with.
LOS ANGELES_ Sistine Rose Stallone, Corinne Foxx, Lewis Pullman talk famous parents.
LOS ANGELES_ Tito Jackson's 'very tight' bond with siblings.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
ARCHIVE_ Brad Paisley out; Reba, Dolly, Carrie Underwood to host CMAs.
NEW YORK_ Virtual Reality 'Star Wars' experience opens in New York shopping mall.
KABUL_ Kabul museum restores art shattered by Taliban.
Last Updated : Sep 27, 2019, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.