ETV Bharat / sports

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ సామ్​ కరన్​కు కరోనా!

author img

By

Published : Jul 3, 2020, 9:55 AM IST

అతిసారంతో బాధపడుతున్న క్రికెటర్ సామ్ కరన్​కు కరోనా పరీక్షలు చేయించింది ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు. హోటల్​ రూమ్​లోనే స్వీయ నిర్బంధాన్ని పాటిస్తూ.. వైద్యుల పర్యవేక్షణలో అతడిని ఉంచినట్లు బోర్డు తాజాగా ప్రకటించింది. ​

Sam Curran not well, undergoes COVID-19 test
ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ సామ్​ కరన్​కు కరోనా లక్షణాలు!

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ సామ్​ కరన్​కు అనారోగ్యం కారణంగా కరోనా పరీక్షలు చేయించింది ఆ దేశ క్రికెట్​ బోర్డు. ప్రస్తుతం అతడు ఉంటున్న హోటల్​ రూమ్​లోనే స్వీయనిర్బంధంలో ఉంటున్నాడని తెలిపింది. ప్రస్తుతం జరుగుతోన్న సన్నాహక మ్యాచ్​ నుంచి ఈసీబీ అతడిని తప్పించింది.

"ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ సామ్​ కరన్ గతరాత్రి నుంచి డయేరియాతో బాధపడుతున్నాడు. గురువారం మధ్యాహ్నానికి కొంచెం కోలుకున్నాడు. ముందు జాగ్రత్తగా వైద్యులు అతడికి కరోనా పరీక్ష చేసి పర్యవేక్షిస్తున్నారు. సామ్​ ప్రస్తుతం హోటల్​ రూమ్​లో స్వీయనిర్బంధంలో ఉన్నాడు. ​ప్రస్తుతం జరుగుతోన్న ప్రాక్టీస్​ మ్యాచ్​లో అతడు​​ పాల్గొనడం లేదు".

- ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు

ఇంట్రా-స్క్వాడ్​ సన్నాహక మ్యాచ్​ తొలిరోజు 15 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు సామ్​ కరన్​. ఇంగ్లాండ్​ జట్టు ప్రాక్టీసులో భాగంగా ఈ మ్యాచ్​ను నిర్వహిస్తున్నారు. కరోనా సంక్షోభం తర్వాత తొలిసారి అంతర్జాతీయ క్రికెట్​ కార్యకలాపాలు మొదలయ్యే క్రమంలో జులై 8 నుంచి వెస్టిండీస్​, ఇంగ్లాండ్​ మధ్య టెస్టు సిరీస్​ ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి... 'నేను చూశా.. ధోనీలో జోరు ఏమాత్రం తగ్గలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.