ETV Bharat / sports

రోడ్ సేఫ్టీ సిరీస్: టైటిల్​ పోరులో ఇండియా-శ్రీలంక ఢీ!

author img

By

Published : Mar 20, 2021, 12:20 PM IST

India Legends to face Sri Lanka Legends in final
టైటిల్​ పోరులో ఇండియా-శ్రీలంక ఢీ!

మాజీ దిగ్గజాలతో జరుగుతోన్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్​ తుదిదశకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఇండియా లెజెండ్స్​తో శ్రీలంక లెజెండ్స్ తలపడనుంది.

మాజీ దిగ్గజాలతో జరుగుతున్న రోడ్‌ సేఫ్టీ సిరీస్ ఎట్టకేలకు చివరి అంకానికి చేరింది. ఆదివారం సాయంత్రం రాయ్‌పూర్‌లోని షాహీద్‌వీర్‌ నారాయణ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఇండియా లెజెండ్స్‌, శ్రీలంక లెజెండ్స్‌ తలపడనున్నాయి. గతరాత్రి దక్షిణాఫ్రికా లెజెండ్స్‌ను చిత్తు చేసిన లంక లెజెండ్స్‌ ఫైనల్‌ చేరింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం భారత్‌తో తలపడనుంది.

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సిరీస్‌ నిజానికి గతేడాది మార్చిలో ప్రారంభమైంది. మొత్తం ఏడు జట్లు పోటీపడగా, చివరికి భారత్‌, లంక జట్లు తుది పోరుకు అర్హత సాధించాయి. 2020 మార్చి 7న ఇండియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య తొలి పోరు జరిగింది. తర్వాత దేశంలో కరోనా కేసుల ప్రభావంతో నాలుగు మ్యాచ్‌ల తర్వాత సిరీస్ వాయిదా పడింది. మళ్లీ ఈ ఏడాది మార్చి 11 నుంచి మిగతా మ్యాచ్‌లను నిర్వహించగా భారత్‌ వరుస విజయాలతో దూసుకెళ్లింది. సచిన్‌, సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌లు మునుపటి రోజుల్ని గుర్తుకు తెస్తూ భారత్‌ను ముందుండి నడిపిస్తున్నారు.

ఇక గతరాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణఫ్రికాను నువాన్‌ కులశేఖర 5/25 కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ వాన్‌వింక్‌(53; 47 బంతుల్లో) ఒక్కడే రాణించాడు. ఆపై లంక బ్యాట్స్‌మెన్‌ ఉపుల్‌ తరంగా(39*; 44 బంతుల్లో), చింతక జయసింగే(47*; 25 బంతుల్లో) రాణించడం వల్ల ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే రేపు భారత్‌, శ్రీలంక జట్లు తుదిపోరులో తలపడనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.