ETV Bharat / sports

రహానె వచ్చాక డ్రస్సింగ్ రూమ్​లో అలా: అశ్విన్

author img

By

Published : Dec 29, 2020, 6:29 PM IST

రహానె కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రస్సింగ్​ రూమ్​లో వాతావరణం మారిందని స్పిన్నర్​ అశ్విన్​ చెప్పాడు. తొలి టెస్టులో తాము ఓడినా సరే రెండో టెస్టులో తిరిగి వేగంగా పుంజుకున్నామని తెలిపాడు.

Rahane brought calmness in dressing room: Ashwin
'రహానె వచ్చాక డ్రస్సింగ్​ రూమ్​లో ప్రశాంతత వచ్చింది'

టీమ్​ఇండియా తాత్కాలిక టెస్టు కెప్టెన్​ అజింక్య రహానె రాకతో డ్రస్సింగ్​ రూమ్​లో ప్రశాంతత పెరిగిందని స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ అభిప్రాయపడ్డాడు. అదే మైదానంలో బాగా రాణించడానికి కారణమైందని చెప్పాడు. తొలి పోరులో ఓడినా సరే బాక్సింగ్​ డే టెస్టులో పుంజుకున్నామని మ్యాచ్​ అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

"36 పరుగులకే ఆలౌట్​ అవ్వడం సాధారణ విషయం కాదు. తొలి టెస్టులో ఓడిన తర్వాత అంతే వేగంగా గెలవడం మా జట్టుకు గర్వకారణం. రహానె కెప్టెన్​ అయిన తర్వాత డ్రస్సింగ్​ రూమ్​లో ప్రశంతమైన వాతావరణం వచ్చింది. ఆ ప్రశాంతతే మైదానంలో రాణించడానికి కారణమై ఉండొచ్చు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్​లో స్టీవ్​ స్మిత్​ ఔట్​ అవ్వకపోయి ఉంటే మా విజయం కొంచెం కష్టమయ్యేది. అతడిని ఔట్​ చేయడానికి ముందుగా అనుకున్న ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాం"

- రవిచంద్రన్ అశ్విన్​, టీమ్​ఇండియా స్పిన్నర్​

ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమ్​ఇండియా. కెప్టెన్‌ రహానె(27*), ఓపెనర్‌ గిల్‌(35*) ఆకట్టుకున్నారు. దీంతో సిరీస్‌ 1-1తో సమమైంది.

ఇదీ చూడండి: సిడ్నీలోనే మూడో టెస్టు..ఆసీస్ బోర్డు ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.