ETV Bharat / sports

కోహ్లీతో పాటే స్వదేశానికి షమీ!

author img

By

Published : Dec 21, 2020, 7:43 AM IST

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో గాయపడిన టీమ్​ఇండియా పేసర్​ మహ్మద్​ షమీ.. సిరీస్​కు పూర్తిగా దూరంకానున్నట్లు తెలుస్తోంది. అతడు కోలుకోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో కెప్టెన్​ విరాట్​ కోహ్లీతో పాటు షమీ స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది.

Mohammed Shami ruled out of remaining Australia Tests, retured to india with Kohli!
కోహ్లీతో పాటే స్వదేశానికి తిరిగి వస్తున్న షమీ!

భారత అభిమానులకు చేదువార్త. గాయం కారణంగా టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియా సిరీస్‌కు పూర్తిగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్‌ వేసిన షార్ట్‌పిచ్ బంతి షమీ మణికట్టుకు బలంగా తాకింది. దీంతో అతడు విపరీతమైన నొప్పితో విలవిలలాడాడు. అనంతరం మైదానాన్ని వీడాడు. అయితే స్కానింగ్‌లో అతడి మణికట్టులో పగుళ్లు వచ్చినట్లు సమాచారం. అతడు కోలుకోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని, విరాట్ కోహ్లీతో కలిసి స్వదేశానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పితృత్వ సెలవుల కారణంగా కోహ్లీ ఇంటికి వస్తున్నాడు.

బౌన్సర్లు, యార్కర్లతో ప్రత్యర్థులకు ఇబ్బంది పెట్టే షమి జట్టుకు దూరమవ్వడం టీమిండియాకు ప్రతికూలాంశమే. ఇప్పటికే ఇషాంత్‌ శర్మ దూరమయ్యాడు. ఈ సమయంలో అనుభవజ్ఞుడు షమీ కూడా అందుబాటులో లేకపోవడం జట్టును కలవరపెడుతోంది. అయితే షమీ స్థానంలో నటరాజన్‌, శార్దూల్ ఠాకూర్‌లో ఒకరికి జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికైన వారిద్దరు బ్యాకప్‌ ప్లేయర్లుగా జట్టుతోనే ఉన్నారు. వారితో పాటు కార్తిక్‌ త్యాగి కూడా నెట్‌బౌలర్‌గా ఉన్నాడు. అయితే షమి గాయంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు తొడకండరాల గాయం, కంకషన్‌తో తొలి టెస్టుకు దూరమైన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్‌ 26న భారత్ రెండో టెస్టు ఆడనుంది.

ఇదీ చూడండి: బాక్సింగ్ ప్రపంచకప్​: భారత్​ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.