ETV Bharat / sports

దిగ్గజ ధోనీ నెలకొల్పిన 'తొలి' రికార్డులెన్నో

author img

By

Published : Aug 16, 2020, 2:04 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి​ ధోనీ.. 16 ఏళ్ల కెరీర్​లో ఎన్నో ఘనతలు సాధించాడు. వీటిలోని చాలా రికార్డులు నమోదు చేసిన వారిలో ధోనీనే తొలి క్రికెటర్ కావడం విశేషం. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?

దిగ్గజ ధోనీ నెలకొల్పిన 'తొలి' రికార్డులెన్నో
ధోనీ

కెప్టెన్​గా జట్టుకు మార్గనిర్దేశం చేస్తూనే.. బ్యాట్స్​మన్​, వికెట్​ కీపర్​గా తనదైన ప్రతిభతో ఆకట్టుకున్న ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్​ ధోనీ. అభిమానులు, శ్రేయోభిలాషులు ముద్దుగా మాహీ అని పిలుస్తారు. అతడు కెరీర్ ఎంతోమంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తి. కెప్టెన్​గా టీమ్​ఇండియాకు ఎన్ని అద్భుత విజయాలు సాధించిపెట్టాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2016 ఆస్ట్రేలియాలో ఆ దేశంతో జరిగిన టీ20 సిరీస్​ను 3-0 తేడాతో గెలిపించిన ధోనీ.. 140 ఏళ్ల చరిత్రను తిరగరాశాడు. కంగారూ గడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్​ గెల్చిన భారత ఏకైక సారథిగా నిలిచాడు. వికెట్​ కీపర్​ బ్యాట్స్​మన్​గా వన్డేల్లో(183) అత్యధిక స్కోరు సాధించిన ఘనత కూడా మహీదే.

Many firsts of MS Dhoni
ధోనీ

ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు ధోనీ. తన 16 ఏళ్ల కెరీర్​లో మహీ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అతి తక్కువ ఇన్నింగ్స్​లాడి వన్డేలో నంబర్​.1 ర్యాంకింగ్​ దక్కించుకున్నాడు. అత్యధిక సిక్సర్లతో మ్యాచ్​ను ముగించడం సహా కెప్టెన్​గా ఎక్కువ బౌండరీలు బాదిన వాడిగానూ ప్రత్యేకత చాటుకున్నాడు.

ఇలా కెప్టెన్​, బ్యాట్స్​మన్​, వికెట్​ కీపర్​ అన్నింటా ప్రపంచక్రికెట్​లో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు ధోనీ. ఈ క్రమంలోనే కెరీర్​లో నెలకొల్పిన తొలి రికార్డులేంటో తెలుసుకుందాం.

వన్డేల్లో 50 కంటే ఎక్కువ​ సగటు

350 వన్డేలాడిన ధోనీ.. 50 కంటే ఎక్కువ​ సగటుతో 10వేల పైచిలుకు పరుగులు చేసిన తొలి బ్యాట్స్​మన్​గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో మహీ ఆరో స్థానంలో ఉన్నాడు. సచిన్​, గంగూలీ రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. 2004లో అరంగేట్రం చేసినప్పటి నుంచి 50.57 సగటుతో 10,773 పరుగులు చేసి, కోహ్లీ తర్వాత స్థానంలో నిలిచాడు ధోనీ.

Many firsts of MS Dhoni
ధోనీ

టీ20లో ధోనీ సారథ్యంలో విజయాలెన్నో

దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్(2007)​లో 25 సంవత్సరాల వయసులోనే కెప్టెన్సీ అందుకున్నాడు ధోనీ. టోర్నీ మొత్తంగా జట్టును అద్భుతంగా నడిపించి విజేతగా నిలిపాడు. చరిత్ర సృష్టించాడు. 1983లో ప్రపంచకప్​ సాధించిన తర్వాత.. భారత్​ కైవసం చేసుకున్న అతిపెద్ద ట్రోఫీ ఇదే కావడం విశేషం. మొత్తంగా 72 టీ20 మ్యాచ్​ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించి, 41 మ్యాచ్​లను గెలిపించాడు. టీ20​ చరిత్రలో ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్​ అని చెప్పడానికి ఈ గణాంకాలు చాలు.

Many firsts of MS Dhoni
ధోనీ

ఐపీఎల్​లోనూ కెప్టెన్​గా సక్సెస్

ఐపీఎల్​లోనూ మహీకి ఎవరూ సాటిరారు. 2008లో లీగ్​ ప్రారంభమైనప్పటి నుంచి మూడుసార్లు చెన్నై సూపర్​కింగ్స్​ను విజేతగా నిలిపాడు. 66 శాతం విజయాల రేటుతో ప్రస్తుతం కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో 100 విజయాలు సాధించిన తొలి కెప్టెన్​గా గుర్తింపు పొందాడు.

Many firsts of MS Dhoni
ధోనీ

ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి

మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్​గానూ ధోనీ రికార్డు నెలకొల్పాడు. దీనితోపాటే 2007 టీ20 ప్రపంచకప్​, 2011 వన్డే ప్రపంచకప్​, 2013 ఛాంపియన్స్​ ట్రోఫీలను తన ఖాతాలో వేసుకున్నాడు.

Many firsts of MS Dhoni
ధోనీ

టెస్టు ర్యాంకింగ్​లో నంబర్​.1

2009లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో భారత్ అగ్రస్థానంలో​ నిలిచింది. ఈ ఘనత సాధించిన భారత తొలి కెప్టెన్​గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు 60 టెస్టులకు నాయకత్వం వహించగా ఇందులో 23-18 గెలుపు- ఓటములు ఉన్నాయి.

ధోనీ సాధించిన మరిన్ని విజయాలు

  • వన్డేల్లో అత్యధిక నాటౌట్​లున్న ఆటగాడిగా రికార్డు.
  • ఏడో స్థానంలో దిగి 2 సెంచరీలు చేసిన ఘనత ఇతడిదే.
  • సిక్సర్లు కొట్టి 9 వన్డేలను గెలిపించిన ఏకైక కెప్టెన్ ధోనీనే.
  • అంతర్జాతీయంగా అత్యధిక స్టంపింగులు చేసిన రికార్డు ధోనీదే. ఇందులో టెస్టు(38), వన్డే(120), టీ20(34) ఉన్నాయి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.