ETV Bharat / sports

ఐపీఎల్​ ఫ్యాన్స్​కు శుభవార్త.. అక్కడి మ్యాచ్​లపై స్పష్టత

author img

By

Published : Mar 28, 2021, 10:34 AM IST

మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానున్న నేపథ్యంలో, అక్కడి జరగబోయే ఐపీఎల్​ మ్యాచ్​లు నిర్వహణపై సందేహాలు వస్తున్నాయి. ఈ విషయమై ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు స్పందించారు.

Maharashtra's COVID-19 restrictions to not affect India's final ODI, IPL matches
ఐపీఎల్​ అభిమానుల​కు శుభవార్త

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆదివారం(మార్చి 28) నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో ముంబయిలో జరిగే ఐపీఎల్​ మ్యాచ్​లపై ఈ ప్రభావం ఉంటుందేమోనని సందేహాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారి ఒకరు దీనిపై వివరణ ఇచ్చారు.

ఐపీఎల్​లో పాల్గొనే క్రికెటర్లు, ఇతర సిబ్బంది బయో బబుల్​ ఉంటారని, దీంతో వాళ్లకు ఈ నిబంధనల్లో మినహాయింపు ఉంటుందని అసీమ్ గుప్తా అన్నారు. మ్యాచ్​ల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్రేక్షకులకు అనుమతి లేదు కాబట్టి షెడ్యూల్​ ప్రకారం అవి జరుగుతాయని తెలిపారు.

IPL 2021
ఐపీఎల్ 2021

ముంబయి వాంఖడే స్టేడియంలో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, కోల్​కతా నైట్​రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ప్రాక్టీసు చేస్తున్నాయి. ఒకవేళ మహారాష్ట్రలోని కొవిడ్ ఆంక్షలు ఐపీఎల్​ను ప్రభావితం చేసే పరిస్థితి వస్తే అక్కడి మ్యాచ్​లనే వేరే చోటుకు తరలించే విషయమై బీసీసీఐ ఆలోచన చేస్తోందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.

ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే ఈ సీజన్​ తొలి మ్యాచ్​లో ముంబయి-బెంగళూరు జట్ల చెన్నై వేదికగా తలపడనున్నాయి. చెన్నై-దిల్లీ మధ్య రెండో మ్యాచ్​ ముంబయిలో నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.