ETV Bharat / sports

'ఐపీఎల్​ ఆడేందుకు ఆసీస్​ ఆటగాళ్లకు అనుమతిస్తాం'

author img

By

Published : Jul 9, 2020, 9:27 PM IST

సెప్టెంబరులో ఇంగ్లాండ్​ పర్యటనకు సిద్ధమవ్వాలని తమ జట్టు ఆటగాళ్లకు ఆస్ట్రేలియా కోచ్​ జస్టిన్​ లాంగర్​ సూచించాడు. ఒకవేళ ఐపీఎల్​ జరిగితే ఇంగ్లాండ్​ నుంచే భారత్​ వెళ్లడానికి క్రికెటర్లకు అనుమతిస్తామని తెలిపాడు.

Justin Langer Thinks Australia "Have To" Release Players For IPL
'ఐపీఎల్​ ఆడేందుకు ఆసీస్​ ఆటగాళ్లను అనుమతిస్తాం'

ఐపీఎల్‌లో పాల్గొనేందుకు తమ ఆటగాళ్లు సిద్ధమవ్వామని క్రికెట్​ ఆస్ట్రేలియా (సీఏ) ఇటీవలే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో జరగాల్సిన ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత ఐపీఎల్‌లో ఆడొచ్చని ఆ దేశ ఆటగాళ్లకు బోర్డు సూచించిదని సమాచారం. తాజాగా ఈ విషయంపై ఆస్ట్రేలియా కోచ్​ జస్టిన్​ లాంగర్​ స్పష్టత ఇచ్చాడు.

"ఆసీస్‌ జట్టు కచ్చితంగా ఇంగ్లాండ్‌లో పర్యటించాలి. ఒకవేళ ఐపీఎల్‌ జరిగితే ఆసీస్‌ ఆటగాళ్లు ఆడేందుకు అనుమతిస్తాం. అంతర్జాతీయ క్రికెట్​ను తిరిగి అభివృద్ధి చేయడానికైనా సెప్టెంబరులో ఇంగ్లాండ్​ టూర్​కు ఆస్ట్రేలియన్​ క్రికెటర్లు వెళ్లాలి. మరోవైపు కొన్ని రోజులుగా ఐపీఎల్​ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. పరిస్థితులను బట్టి టోర్నీ ప్రణాళిక మారుతూ వస్తోంది. ఏది ఏమైనా ఆస్ట్రేలియాతో టీమ్​ఇండియా సిరీస్​ ఆడాలని కోరుకుంటున్నా".

- జస్టిన్​ లాంగర్​, ఆస్ట్రేలియా క్రికెట్​ కోచ్​

అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా నిర్వహించాలనుకున్న టీ20 ప్రపంచకప్​ వాయిదా పడుతుందన్న నేపథ్యంలో ఇంగ్లాండ్​ పర్యటనకు సిద్ధమవ్వాలని ఆటగాళ్లకు ఆ దేశ బోర్డు సూచించిందని తెలుస్తోంది. ఐపీఎల్​ ఎక్కడ జరిగినా.. ఆసీస్​ ఆటగాళ్లు ఇంగ్లాండ్​ నుంచే వెళ్తొచ్చని క్రికెట్​ ఆస్ట్రేలియా భావిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.