ETV Bharat / sports

ఐపీఎల్: లీగ్​లో సూపర్ డూపర్ ఇన్నింగ్స్​లు ఇవే!

author img

By

Published : Mar 27, 2021, 9:22 AM IST

IPL 2021: Batsmen with highest individual scores in IPL history
ఐపీఎల్: అత్యధిక వ్యక్తిగత స్కోర్లు ఇవే!

బ్యాట్స్​మెన్ వారి ప్రతిభను చూపించడానికి ఐపీఎల్ ఓ వరం. చాలామంది అందులో సక్సెస్ అయ్యారు కూడా. లీగ్​లో అత్యధిక స్కోర్లనూ నమోదు చేశారు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 14వ సీజన్ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఇప్పటివరకు లీగ్​లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల రికార్డు ఎవరిదో చూద్దాం.

మరో కొద్ది రోజుల్లో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఫ్రాంచైజీలు వారి వారి ప్రణాళికలకు పదును పెడుతున్నాయి. ఆటగాళ్లు ప్రాక్టీస్​లో మునిగి తేలుతున్నారు. ప్రతి సీజన్​లాగే ఈసారి కూడా బ్యాట్స్​మెన్ వారి పరుగుల దాహం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ లీగ్​లో కొందరు బ్యాట్స్​మెన్ ప్రత్యర్థి జట్లపై విరుచుపడి భారీ ఇన్నింగ్స్​లు ఆడారు. ఈసారి కూడా ఇలాంటి ఇన్నింగ్స్​నే ఆశిస్తున్నాయి ఫ్రాంచైజీలు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లీగ్​లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.

IPL 2021: Batsmen with highest individual scores in IPL history
ఐపీఎల్​లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు ఇవే

క్రిస్ గేల్ (175)

ఐపీఎల్​లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన బ్యాట్స్​మెన్ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ ముందున్నాడు. 2013 సీజన్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన ఇతడు పుణె వారియర్స్​తో జరిగిన మ్యాచ్​లో 66 బంతుల్లోనే 175 పరుగులు సాధించి సునామీ సృష్టించాడు. ఇందులో 13 ఫోర్లు 17 సిక్సర్లు ఉన్నాయి. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేసిన ఇతడు ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా ఈ మ్యాచ్​లో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 263 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తర్వాత పుణెను 133 పరుగులకే పరిమితం చేసిన కోహ్లీసేన 130 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Gayle
గేల్

బ్రెండన్ మెక్​కలమ్ (158)

ఐపీఎల్ ప్రారంభ సీజన్​ మొదటి మ్యాచ్​లోనే అసలు టీ20 బ్యాటింగ్ అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు న్యూజిలాండ్ బ్యాట్స్​మన్ బ్రెండన్ మెక్​కలమ్. కోల్​కతా నైట్​రైడర్స్​కు ప్రాతనిధ్యం వహించిన ఇతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో కేవలం 73 బంతుల్లోనే 158 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో 10 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్​లో మెక్​కలమ్​ మెరుపు ఇన్నింగ్స్​తో కోల్​కతా 140 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Brendon McCullum
మెక్​కలమ్

డివిలియర్స్ (133)

పరిమిత ఓవర్ల క్రికెట్లో తన 360 డిగ్రీ బ్యాటింగ్​తో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నాడు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్​మన్ ఏబీ డివిలియర్స్. ఐపీఎల్​లోనూ గుర్తుండిపోయే ఇన్నింగ్స్​లు ఆడాడు. 2015లో ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్​మన్ ఏబీడీ 59 బంతుల్లో 133 పరుగులు సాధించాడు. ఇందులో 19 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఈ క్రమంలోనే కోహ్లీ (82)తో కలిసి 215 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్​లో ఆర్సీబీ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.

AB de Villiers
డివిలియర్స్

కేఎల్ రాహుల్ (132)

గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) సారథి కేఎల్ రాహుల్​ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో 69 బంతుల్లో 132 పరుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. ఈ లీగ్​లో ఇప్పటివరకు ఓ భారతీయ ఆటగాడి వ్యక్తిగత అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్​లో పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ఆర్సీబీని 109 పరుగులకే ఆలౌట్​ చేసి 97 పరుగులతో విజయం రాహుల్​సేన.

KL Rahul
రాహుల్

డివిలియర్స్ (129)

ఐపీఎల్​లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన బ్యాట్స్​మెన్ జాబితాలో టాప్​-5లో రెండుసార్లు నిలిచాడు దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ డివిలియర్స్. రాయల్ ఛాలెంంజర్స్ బెంగళూరుకు చెందిన ఏబీడీ 2016 సీజన్​లో భాగంగా గుజరాత్​ లయన్స్​తో జరిగిన మ్యాచ్​లో 52 బంతుల్లో 129 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్​లో కోహ్లీ కూడా సెంచరీ (109) సాధించాడు. వీరిద్దరి విధ్వంసం కారణంగా ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు భారీ స్కోర్ సాధించింది. తర్వాత గుజరాత్​ను 104 పరుగులుకే కట్టడి చేసిన కోహ్లీసేన 144 పరుగుల తేడాతో విజయం సాధించింది.

AB de Villiers, kohli
డివిలియర్స్, కోహ్లీ

ఇవీ చూడండి: ఐపీఎల్: లీగ్​లో అత్యధిక వికెట్ల వీరులు!

ఐపీఎల్: లీగ్​లో అత్యధిక పరుగుల వీరులు వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.