ETV Bharat / sports

ఐపీఎల్ 2020: ముంబయి ఉత్తమ ఓపెనింగ్ జోడీలివే

author img

By

Published : Aug 18, 2020, 7:45 PM IST

గతేడాది ఐపీఎల్​ టైటిల్​ సొంతం చేసుకుని అజేయంగా నిలిచింది ముంబయి ఇండియన్స్ జట్టు. ఈ సారి కూడా ఎలాగైనా కప్పు సొంతం చేసుకోవాలని ఉబలాటపడుతోంది. జట్టుకు అద్భుతమైన ఓపెనింగ్​ భాగస్వామ్యం ఉండటమే ఇంతటి విజయానికి కారణం. ఈ సీజన్​లోనూ ముంబయి జట్టులో ఉత్తమ ఓపెనింగ్​ పార్ట్​నర్​షిప్ కలిగిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.

Mumbai Indians
ముంబయి

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్​ 13వ సీజన్ పండగ​​ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన 12 లీగుల్లో ముంబయి ఇండియన్స్​ అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలుస్తూ వచ్చింది. జట్టులో దృఢమైన టాపార్డర్​​ బ్యాట్స్​మెన్​తో పాటు అద్భుతమైన బౌలర్లు ఉండటమే అందుకు కారణం.

గతేడాది టైటిల్​తో నాలుగు సార్లు లీగ్​ విన్నర్​గా నిలిచిన ముంబయి.. ఈ ఏడాది కూడా ఎలాగైనా కప్పు దక్కించుకోవడమే లక్ష్యంగా కసరత్తులు చేస్తోంది. ఈ సారి జట్టులో రోహిత్​ శర్మ, క్రిస్​ లిన్​, సూర్య కుమార్​ యాదవ్​, క్వింటన్​ డికాక్​ ఇషాన్​ కిషన్ వంటి బలమైన​ ​ ఓపెనర్లు ఉన్నారు. యూఏఈ వేదికగా జరిగే లీగ్​లో జట్టుకు ఎవరి కలయికతో అదృష్టం వరించనుందో తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీజన్​లో ముంబయి ఇండియన్స్​ జట్టులో ఉత్తమ ఓపెనింగ్​ భాగస్వామ్యంపై ఓ లుక్కేద్దాం.

క్రిస్​ లిన్​- రోహిత్​ శర్మ

ముంబయి ఇండియన్స్ జట్టులో బలమైన విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. గతంలో జరిగిన టోర్నమెంటుల్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ క్రమంలోనే రెండో ఓపెనర్​గా క్రిస్ లిన్​ దిగితే.. రోహిత్​ శర్మకు ఉత్తమ భాగస్వామి దొరికినట్లే. వీరిద్దరి కలయికలో ఆట మరింత రసవత్తరంగా మారుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్​ల్లో 130.82 స్ట్రైక్​ రేట్​తో 4,898 పరుగులు చేశాడు రోహిత్​. వాటిలో ఒక సెంచరీతో పాటు 37 అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు క్రిస్​​ లిన్​ తన పేరుమీద 140.66 స్ట్రైక్​ రేట్​తో 10 అర్ధ సెంచరీలతో 1,280 పరుగులు నమోదు చేశాడు.

IPL 2020: 3 ideal opening combinations for the Mumbai Indians
క్వింటన్ డి కాక్​- రోహిత్​ శర్మ

క్వింటన్ డి కాక్​- రోహిత్​ శర్మ

పిచ్​ పరిస్థితులను బట్టి రోహిత్​ శర్మకు ఓపెనింగ్​ భాగస్వామి ఎవరనేది నిర్ణయిస్తారు. పిచ్​ ఫ్లాట్​గా ఉంటే.. డికాక్​ ఆ వరుసలో నిలుస్తాడు. అప్పుడు రోహిత్​ మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు అవకాశం లభిస్తుంది. ఒకవేళ రోహిత్​తో భాగస్వామ్యం విషయంలో డి కాక్​ విఫలమైతే.. తదనంతరం సూర్య కుమార్​ యాదవ్​, ఇషాన్​ కిషన్​లు ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. దక్షిణాప్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్​ డికాక్.. ఐపీఎల్​లో 131.29 స్ట్రైక్​ రేట్​తో 1,456 పరుగులు చేశాడు.

IPL 2020: 3 ideal opening combinations for the Mumbai Indians
క్వింటన్​ డి కాక్​- సూర్య కుమార్​ యాదవ్​

క్వింటన్​ డి కాక్​- సూర్య కుమార్​ యాదవ్​

వీరిద్దరి కలయికలో ముంబయి మ్యాచ్​ మొత్తం ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. ఒకరు లెఫ్ట్​ హ్యాండ్​, మరొకరు రైట్​ హ్యాండ్​ బ్యాట్స్​మన్​. సూర్య కుమార్​ యాదవ్​కు రంజీ ట్రోఫీ అనుభవం యూఏఈలో రాణించడానికి బాగా సాయపడుతుంది. ఇక వేగంగా పరుగులు సాధించే బాధ్యతను క్వింటన్​ తీసుకుంటే సరిపోతుంది. ఈ ద్వయంతో ఐపీఎల్​ 2020లో ముంబయి జట్టు సరైన గెలుపును సాధించగలదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. యాదవ్​ తన ఐపీఎల్​ కెరీర్​లో 131.63 స్ట్రైక్​ రేట్​తో 7 అర్ధ సెంచరీలతో కలిపి 1,544 పరుగులు చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.