ETV Bharat / sports

'బాక్సింగ్​ డే టెస్టు కోసం ఎదురుచూస్తున్నా'

author img

By

Published : Dec 17, 2020, 1:26 PM IST

టీమ్​ఇండియాతో జరగనున్న బాక్సింగ్​ డే టెస్టులో తప్పకుండా ఆడతానని ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్​తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన వార్నర్​.. కొన్ని రోజులుగా క్రికెట్​ ఆస్ట్రేలియా పునరావాసంలో ఉన్నాడు.

Injured Australia opener David Warner targets Boxing Day Test return
డేవిడ్​ వార్నర్​

మెల్​బోర్న్​ వేదికగా టీమ్​ఇండియాతో జరగనున్న బాక్సింగ్​ డే టెస్టు​ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్​ వార్నర్​ తెలిపాడు. గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరం కావడం తనను నిరాశ పరిచిందని వెల్లడించాడు.

"భారత్​తో ఇది ప్రధాన సిరీస్​. రెండో టెస్టులో తప్పకుండా ఆడతా. ఎట్టి పరిస్థితుల్లో దూరం కాను. గాయం వల్ల మొదటి మ్యాచ్​లో ఆడకపోవడం బాధ కలిగించింది. వికెట్ల మధ్య పరుగెత్తడానికి ప్రస్తుతం ప్రాక్టీస్​ చేస్తున్నా."

- డేవిడ్​ వార్నర్​, ఆస్ట్రేలియా ఓపెనర్​.

టీమ్​ఇండియాతో జరిగిన రెండో వన్డేలో గాయపడిన​ వార్నర్​.. ఇంకా కోలుకోలేని క్రమంలో తొలి టెస్టుకు దూరమయ్యాడు. భారత్​తో జరిగిన మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్​కు వార్నర్​ పూర్తిగా అందుబాటులో లేడు.

ఇదీ చూడండి: డిన్నర్ బ్రేక్: టీమ్ఇండియా 41/2

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.