ETV Bharat / sports

భారత్​Xదక్షిణాఫ్రికా: వర్షం తగ్గితే టీ20 మ్యాచ్​ చూడొచ్చు

author img

By

Published : Mar 12, 2020, 4:16 PM IST

ధర్మశాల వేదికగా భారత్​-దక్షిణాఫ్రికా మధ్య నేడు తొలి వన్డే జరగాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇప్పటికీ టాస్​ పడలేదు. ప్రస్తుతం వాన తగ్గడం వల్ల మ్యాచ్​ను 20ఓవర్లకు కుదించాలని బీసీసీఐ భావిస్తోంది. సాయంత్రం 6గంటల 30 నిముషాలకు మైదానం సిద్ధమైతే టీ20 రూపంలో ఆట​ జరగనుంది.

India vs South Africa
వర్షం పడకపోతే వన్డే.. టీ20 మ్యాచ్​ అవుతుందా?

భారత్‌, దక్షిణాఫ్రికా తొలి వన్డే జరిగే అవకాశాలు కనిపించడం లేదు! ధర్మశాల వేదికగా మ్యాచ్​ మధ్యాహ్నం 1:30 గంటలకు ఆరంభమవ్వాల్సిన ఈ మ్యాచ్‌ టాస్‌ ఇంకా పడలేదు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షమే ఇందుకు కారణం. ఉదయం మొదలైన వర్షం ఆగి ఆగి కురుస్తోంది. ప్రస్తుతం వాన తగ్గినా.. ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల ఆటపై సందిగ్ధం నెలకొని ఉంది. పిచ్​ కూడా తడిగా ఉంది. సాయంత్రం 6గంటల 30 నిముషాలకు మైదానం సిద్ధం చేయగలిగితే టీ20 రూపంలో ఆట​ జరగనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

ప్రస్తుతం మైదానం చిత్తడిగా ఉండటం, సరైన వెలుతురు లేమి కారణంగా మ్యాచ్​ జరగకపోవచ్చని అభిమానులు భావిస్తున్నారు. అందుకే మ్యాచ్​ వీక్షించేందుకు వచ్చిన కొద్దిమంది కూడా నెమ్మదిగా వెళ్లిపోతున్నారు. ఈ వన్డే రద్దయితే రెండో మ్యాచ్​ మార్చి 15న లఖ్​నవూ వేదికగా జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.